రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను లీక్ చేసిన తరువాత ఈవార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనితో రేణు దేశాయ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటే పవన్ వీరాభిమానులు మాత్రం ఈవార్తను జీర్ణించుకోలేక రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 
మంచి వారు
ఈనేపధ్యంలో తాను రెండవసారి పెళ్లి చేసుకోబోతున్నందుకు తనను అభినందిస్తూ మెసేజ్ లు పెట్టిన చాలామందికి కృతజ్ఞతలు తెలియచేస్తూ రేణు దేశాయ్ వివాహ వ్యవస్థ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రెండవ పెళ్లి చేసుకుంటున్న వ్యక్తిని తాను ప్రేమించి పెళ్ళి చేసుకోలేదని తమది తమ కుటుంబ సభ్యులు కుదిర్చిన సాంప్రదాయ వివాహం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
స్నేహితుల సలహాకు రేణు నో
ఇదేసందర్భంలో ‘ప్రేమ’ గురించి కామెంట్ చేస్తూ ఏవ్యక్తి అయినా ఒకే ఒక్కసారి తమ జీవితంలో ప్రేమలో పడతారని అది తన జీవితంలో ఎప్పుడో జరిగిపోయింది అంటూ పవన్ తో తమ ప్రేమ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. అయితే తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయడం ఇష్టం లేదనీ అయితే గతంలో తాను అలా చేయడానికి కొన్ని పరిస్థుతుల ఒత్తిడిలు తనకు ఇష్టం లేకపోయినా తాను సహజీవనం చేసేలా పరిస్థుతులు ఏర్పడ్డాయి అంటూ రేణు కామెంట్స్ చేసింది.
స్నేహితులు ప్రశ్నించారు
రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ల పెళ్ళికి ముందు దాదాపు 6 సంవత్సరాలు కలిసి ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ‘ప్రజారాజ్యం’ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చిరంజీవి ఒత్తిడితో అప్పటి రోజులలో పవన్ రేణు దేశాయ్ ని పెళ్ళి చేసుకున్నాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆతరువాత రేణు పవన్ తో విడిపోయి చాల సంవత్సరాలు ఒంటరిగా పూణేలో కొంత కాలం గడిపిన తరువాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటూ వివాహ వ్యవస్థ పై సహజీవనం పై ఇప్పుడు ఇలా కామెంట్స్ చేసింది. తన పిల్లలు తన ఆధిపత్యంలోనే ఉన్నారని చెపుతూ వారికి నచ్చినప్పుడు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు తమ తండ్రి పవన్ దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటారనీ మరో ట్విస్ట్ ఇచ్చింది రేణు దేశాయ్..  


మరింత సమాచారం తెలుసుకోండి: