స్వీటీ అనుష్క.. ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. అందం అభినయంతో అదరగొడుతూ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్లీ మునుపటి క్రేజ్ తెచ్చిన హీరోయిన్ ఆమె. అరుంధతి నుండి భాగమతి వరకు కేవలం అనుష్క మాత్రమే చేయగలదు అన్నంతలా సత్తా చాటింది.


ఇక కొన్నాళ్లుగా అనుష్క పెళ్లి మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. కాని దేనికి కచ్చితమైన ఆధారాలు లేవు. ప్రభాస్ తో అయితే ఎన్నోసార్లు పెళ్లిచేశారు గాసిప్పు రాయుళ్లు. పెళ్లీడు దాటిపోతుందని ఇంట్లో వాళ్లు కంగారు పెడుతున్నా అనుష్క మాత్రం మనసుకి నచ్చిన వాడి కోసం వెయిట్ చేస్తుంది.


ఫైనల్ గా అనుష్కకు వరుడు దొరికేశాడట. దుబాయ్ లో ఓ బిజినెస్ మెన్ అనుష్కను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడట. ఈ ఏడాది చివర్లోనే వీరి పెళ్లి ఉంటుందని చెబుతున్నారు. మరి ఇది కూడా రూమర్ గా మిగిలిపోతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న అనుష్క తెలుగులో సైలెన్స్ అనే మూవీ కూడా చేస్తుంది. 


పెళ్లి తర్వాత అనుష్క సినిమాలను కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈమధ్య అనుష్కను మళ్లీ ప్రభాస్ తో లింక్ పెడుతూ వార్తలు రాశారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అనుష్క పెళ్లిచేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. మరి ఆ లక్కీ గాయ్ ఎవరో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: