బుల్లితెరపై రియాల్టిషోలకు క్రేజ్‌ పెరిగిపోతోంది. దీనిపై సెలబ్రెటీలకు కూడా మక్కువ పెరుగుతోంది. పెద్ద స్టార్స్‌ చేత ఈ షోలను నిర్వహించడంతో జనాల్లో ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్‌లో బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే.  ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది. 
Image result for big boss 2 telugu
ఇక తెలుగు లో బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హంగామా చేయగా ప్రస్తుతం బిగ్ బాస్ 2 సీజన్ కి నేచురల్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.   తెలుగు, తమిళ, కన్నడం, మళయాలం, మరాఠి, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ షోను నిర్వహిస్తున్నారు. తమిళ్‌ బిగ్‌బాస్‌ షోకు కమల్‌హాసన్‌, కన్నడకు షోకు సుదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
Image result for big boss 2 tamil
ఆదివారం (జూన్‌ 24న) ప్రారంభమైన బిగ్‌బాస్‌ మొదటి రోజున 16 మంది పోటీదారులను మోహన్‌లాల్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టేలా బిగ్‌బాస్‌ హౌజ్‌ను రూపొందించారు. తన సినిమాల్లోని ఫేమస్‌ డైలాగ్స్‌తో ప్రారంభమైన షోను ఆద్యంతం తనదైన స్టైల్‌లో ముందుకు నడిపించారు మోహన్‌లాల్‌. 
Image result for big boss 2 kannada
ప్రస్తుతం బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు భారీ పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మలయాళ నాట మోహన్‌లాల్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ ఒప్పుకుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: