ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ ప్రారంభించిననాటి నుండి ఎదో ఒకసమస్య బాలయ్యను వెంటాడుతూనే ఉంది. ఈసినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తేజ తప్పుకున్న తరువాత బాలయ్య క్రిష్ ను ఈమూవీకి ఒప్పించడానికి చాల కష్టపడ్డాడు అన్న కామెంట్స్ ఇప్పటికే ఉన్నాయి. జూలై నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీ నిర్మాణానికి సంబంధించి ఒక కీలక విషయంలో బాలకృష్ణ క్రిష్ ల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 
Krish Jagarlamudi will take over NTR biopic, replaces Teja as director.
ఈబయోపిక్ ను రెండు భాగాలుగా తీసి ఒకభాగం రాబోతున్న సంక్రాంతికి విడుదల చేసి మరొక భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేయాలనే ఆలోచనలు చేస్తున్న క్రిష్ ఆలోచనలకు బాలకృష్ణ నో చెప్పినట్లు సమాచారం. ‘మహానటి’ మూవీ నిర్మాణం చేసినట్లుగా మూడు గంటల వ్యవధిలో ఈ బయోపిక్ ను పూర్తి చేయమని బాలయ్య క్రిష్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. ఈ విషయాలు క్రిష్ కు ఏమాత్రం నచ్చకపోయినా క్రిష్ రాజీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ఈసినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను బాలకృష్ణ ఫిక్స్ చేయడంతో ఈమూవీలోని పాత్రలకు సరైన నటులను ఎంపిక చేయడంలో సమస్యలు రావడంతో ఈమూవీలో చాలామంది బాలీవుడ్ నటులు కనిపించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీలో చంద్రబాబు పాత్ర పోషిస్తున్న రానాకు నిన్నటి నుంచి ఈమూవీకి సంబంధించి వర్క్ షాప్ మొదలైనట్లు టాక్. చంద్రబాబునాయుడు బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి చంద్రబాబు మాటతీరు వరకు రానా పూర్తిగా పరిశీలించే విధంగా ఈ వర్క్ షాప్ లో రానాను షేప్ చేస్తున్నట్లు సమాచారం. 

శర్వానంద్ ను చిన్నప్పటి ఎన్టీఆర్ గా చూపించాలి అన్న నిర్ణయంతోపాటు నాగచైతన్యను అక్కినేని నాగేశ్వరావుగా చూపించాలి అని క్రిష్ చేస్తున్న సూచనలకు ఇంకా బాలయ్య అంగీకారం పూర్తి స్థాయిలో రాలేదు అని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఇన్ని రాజీలు సద్దుబాటుల మధ్య ఎన్టీఆర్ బయోపిక్ ను ఎంతవరకు క్రిష్ అనుకున్న సమయానికి విజవంతంగా పూర్తి చేస్తాడు అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: