రేణు దేశాయ్‌ నిశ్చితార్థం జ‌రిగింది. ఈ విష‌యాన్ని రేణు స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో వెల్ల‌డించ‌డం విశేషం.   నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు.   ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తన వివాహం గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 
Image result for renu desai engagement
తనది ప్రేమ వివాహం కాదని, అతన్ని తాను ప్రేమించి పెళ్లాడటం లేదని రేణు వ్యాఖ్యానించారు. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలుగా ఒంటరిగానే ఉన్నానని..అయితే పెళ్లి విషయం గురించి ఎంతో మంది తనతో చర్చించారని..అయితే ఇన్నేళ్లు సంతోషంగా ఉన్న తాను వివాహం చేసుకున్నా అలాగే ఉండగలుగుతానని నమ్మకం వచ్చిందని అన్నారు. 

జీవితంలో ఒక్కసారే ప్రేమలో పడటం జరుగుతుందని, గత ఏడేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడిపిన తాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. పెళ్లిపై తనకు ఆతృత ఎంతమాత్రమూ లేదని చెప్పారు. అతను చాలా ప్రశాంతంగా ఉంటారని కాబోయే భర్తపై పశంసలు కురిపించిన రేణూ దేశాయ్, మళ్లీ సహజీవనం చేయాలని అనుకోవడం లేదని, అందుకే సంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: