తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ తో హాట్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి గౌతమ్.   ఇందులో జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు.  ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది.  మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు.  కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.   

అప్పుడుప్పుడు కాంట్ర వర్సీలు కూడా జరుగుతున్నాయి.  హైపర్ ఆది తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "కాలేజ్ రోజుల నుంచే ఎదుటివారి మాటలకు నేను ఎక్కువగా పంచ్ లు వేసేవాడిని. అంతే కాదు క్లాస్ రూమ్ లో లెక్చరర్ పాఠం చెబుతున్న సమయంలో కూడా నేను బాగా అల్లరి చేసేవాడిని అన్నారు..ఒకరోజు మా ఫ్రెండ్స్ తో చాలెంజ్ చేశారు. 
Image result for hyper adi
పైన తిరుగుతున్న ఫ్యాన్ ఒక్క వేలితో ఆపేగల కెపాసిటీ నాకు ఉందని అన్నాను..దాంతో ఫ్యాన్ ఎలా ఆపగలడూ అని ఆశ్చర్యపోయారు..ఏలారా అంటూ ప్రశ్నించారు..ఏముంది 'స్విచ్ ఆఫ్ చేసి' అన్నాను. అంతే .. వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. పాఠం చెబుతోన్న లెక్చరర్ ఆ క్లాస్ అయ్యేంతవరకూ నన్ను నిలబెట్టాడు.  అప్పటి నుంచి మా క్లాస్ లో ఎవరు జోక్స్ వేసినా..ఎవరు నవ్వినా..అల్లరి చేసినా..నాకే పనిష్ మెంట్ ఇచ్చేవారు మా లెక్చర్ అంటూ నవ్వారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: