తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది.   ఆ మద్య బాలీవుడ్ లో ధోని జీవితక కథ ఆధారంగా తెరకెక్కించిన ‘ధోని’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా ‘సంజూ’ రాబోతుంది.  ఇక తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సూపర్ డూపర్ హిట్ కావడంతో తెలుగు లో వరుసగా బయోపిక్ చిత్రాలకు తెర లేపారు.  ప్రస్తుతం మహనటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. 
Image result for ntr biopic
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.  ఎన్టీఆర్ జీవితంలో ఆయనతో కలసి పనిచేసిన కొందరు స్టార్ల ప్లేసులో ఎవరిని తీసుకుంటారా అనే సందేహం చాలామందికి ఉంది. అక్కడే ఇప్పుడు ఒక కొత్త రూమర్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీదేవి పాత్రలో దీపికా పదుకొని నటిస్తుందని.. జయప్రద రోల్ ను తమన్నా చేస్తుందని గతంలో రూమర్లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ హయాంలో టాప్ నటులుగా కొనసాగిన ఏఎన్నార్ అండ్ కృష్ణ పాత్రల గురించి కొన్ని టాలీవుడ్ లో రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Image result for ntr biopic
ఏఎన్నార్ పాత్రలో మెరిసిన నాగచైతన్యను.. ఇప్పుడు ఈ బయోపిక్ లో కూడా అదే పాత్రకు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.  అలాగా సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబును అడిగారట. ఆయన కూడా వెంటనే ఓకె అన్నారు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి.. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్య బాలన్ కనిపిస్తారని.. అఫీషియల్ గా కాకపోయిన సన్నిహితవర్గాలు కన్ఫామ్ చేసిన న్యూస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: