ఈ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెద్ద పోరాటం చేసింది నటి శ్రీరెడ్డి.  ఆమె పోరాటానికి అందరూ సహకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా పవన్ కళ్యాన్ ని తిట్టడంతో అటు పవన్ ఫ్యాన్స్, ఇటు ఆమెకు సపోర్ట్ గా నిలిచిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.   సిని ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని పోరాటం చేస్తూ..పర్సనల్ విషయాపై కామెంట్ చేయడం అందరికీ ఆగ్రహం తెప్పించింది.  ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ శ్రీరెడ్డిని తిట్టి పోస్తూనే ఉన్నారు.  అయినా కూడా శ్రీరెడ్డి ఇంటికి పరిమితం అయి కూడా పవన్, నాని, పలువురు హీరోయిన్లను టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేస్తుంది.
Related image
ఇక చికాగో సెక్స్ రాకెట్ లో అవకాశాల పేరుతో వర్ధమాన నటీమణులను కొందరు మోసం చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది.  అయితే  శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్టు చేసే నటి పవిత్రా లోకేష్.  ‘కాస్టింగ్ కౌచ్ అంశం అనేది చాలా సున్నితమైనది.. ఈ విశ్వంలో ఆడ - మగ అనే రెండే జాతులున్నాయి. ఆడవాళ్లు మగవాళ్లని.. మగవాళ్లు ఆడవాళ్లను ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అదే ప్రకృతి ధర్మం’ అని కుండబద్దలు కొట్టింది.
Related image
మహిళలు  తమ కుటుంబాలను పోషించడానికో..తామను తాము పోషించుకోవడానికో ఏదైని పనిచేసే సమయంలో కొన్ని చోట్ల ఇలాంటి కాస్టింగ్ కౌచ్ కి పాల్పడే వారు ఉంటారు..అలాంటి సమయంలో అక్కడ సమయస్పూర్తి తో మెలిగి తప్పించుకోవడానికి ప్రయత్నాంచాలి.  లేదంటే..నువు చేయాలనుకున్న పని చేయలేవు..ఎక్కడా సాధ్యం కాదు.  ‘కాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో చాలా పెద్ద పేరు. 4 - 5 ఏళ్ల చిన్నారులు రేప్ కు గురవుతున్నారు. ఇది అసలు పెద్ద విషయం .
Image result for sri reddy
ఎవరైనా మాట్లాడితే ఈ చిన్న పిల్లల దారుణాలపై మాట్లాడండి.. కాస్టింగ్ కౌచ్ పై కాదు’ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది.పరిణతి చెందిన ఇద్దరు ఆడ - మగ మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎందుకు ఇంత రచ్చ. దీనికి అంగీకరిస్తున్న వారంతా 4 - 5 ఏళ్ల చిన్న చిన్నారులు కాదు కదా.. ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఆడుతున్నారు.

అంతే కాదు కొంత మంది తామంతా చేసి ఇప్పుడు ఏదో ఉద్దరిస్తున్నట్లు మాట్లాడుతున్నారు.   ఈ విషయాన్ని మొదట్లోనే నో చెప్పే చాయిస్   ఉంది. కానీ ఎందుకు అలా చేయడం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి వాడుకున్నారు అని గోల చేస్తే ఎలా   పవిత్ర  లోకేష్ మండిపడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: