మెగా హీరోల సినిమాల లెక్క వేరేలా ఉంటుంది. మొదటి సినిమాతోనే మెగా అభిమానుల మనసు గెలవడం కేవలం మెగా హీరోల వల్లే అవుతుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విజేత సినిమాతో కళ్యాణ్ ఎంట్రీ జరుగుతుంది. 


రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. ఈమధ్యనే ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా జూలై 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.


ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే తన తర్వాత సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట కళ్యాణ్ దేవ్. మొదటి సినిమా నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినా సెకండ్ మూవీ మాత్రం క్రేజీ డైరక్టర్ తో చేస్తున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ రెండో సినిమా హరీష్ శంకర్ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది.


పవన్ తో గబ్బర్ సింగ్, తేజూతో సుబ్రమణ్యం ఫర్ సేల్, బన్నితో దువ్వాడ జగన్నాథం సినిమాలు తీసిన హరీష్ శంకర్ ఈసారి కళ్యాణ్ దేవ్ తో క్రేజీ మూవీ చేయబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ ఓకే అవగా మిగతా చర్చలు నడుస్తున్నాయట. మరి హరీష్ తో కళ్యాణ్ దేవ్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: