ఈసారి ‘బిగ్ బాస్ 2’ షోకు కాలం ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటికే ఈ షోను హోస్ట్ చేస్తున్న నాని సమర్థత పై విమర్శలు రావడంతో పాటు ఈ షోలో పాల్గొంటున్న సెలెబ్రెటీల స్థాయి చెప్పుకోతగ్గదిగా లేదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ‘బిగ్ బాస్ 2’ షో రేటింగ్స్ తగ్గిపోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. 
ఎలిమినేషన్ లిస్టులో కూడా లేని బాబు
దీనితో ఈ షోను ఎలా నిలబెట్టాలి అన్న విషయమై స్టార్ మా యాజమాన్యం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ 2 షోలో అందరి మన్ననలు పొందుతున్న కంటెస్టెంట్ హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు అని వార్తలు రావడం సంచలనంగా మారింది. 
అంతా బిగ్ బాస్ చేతిలోనే...
ఒక మతాన్ని కించపరిచేలా ఆయన యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడారనే అంశంతో పాటు వారు చేపట్టే ప్రైవేటు కార్యక్రమం కోసం ఆధార్‌ నంబర్లను తీసుకోవడం పై కేవీ నారాయణ అనే వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్పందించి గోగినేని పై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేయమని న్యాయస్థానం ఆదేసించడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో ‘బిగ్ బాస్’ షోలో బాబు గోగినేని పరిస్థితి ఏమిటి అన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి.
 గత సీజన్లో ముమైత్ ఖాన్‌కు ఇలానే...
ప్రస్తుతం ఆయన ఎలిమినేషన్ రౌండ్ లో కూడ లేని నేపధ్యంలో బాబు గోగినేనిని ఈవిషయం పై విచారించేందుకు ‘బిగ్ బాస్ 2’ పూర్తి అయ్యే వరకు వేచి ఉంటారా ? లేదంటే ఈలోపునే ‘బిగ్ బాస్’ షూటింగ్ నుండి బాబు గోగినేనిని బయటకు తీసుకు వచ్చి విచారిస్తారా అన్న విషయం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  గత ‘బిగ్ బాస్’ సీజన్ లో కూడ బాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంట్లో ఉండగా ఆమె టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు తీసుకువెళ్ళి ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. దీనితో బాబు గోగినేని విషయంలో స్టార్ మా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయమై ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: