ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ సినిమా వారు వైసీపీ  పార్టీ లోకి వెళ్లాలని ఎక్కువ మంది నిర్ణయించుకున్నారు. అయితే సినిమా వారికి రాజకియల్లో చాలా వరకు ఆసక్తి ఉందని చెప్పవచ్చు. ఇంతక ముందు కూడా చాలా అందని ఎమ్మెల్యేల గా మరియు ఎంపీల గా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఇప్పడూ 2019 ఎన్నికల దగ్గరైన వేళ చాలా మంది సినీ నటులు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. 

Image result for ysrcp

తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా వర్తమాన రాజకీయాలపై సదా అలెర్ట్ గా వుండే హీరో నిఖిల్ కు కూడా పరోక్షంగా వైకాపా బంధాలు అలుముకున్నాయి. నిఖిల్ స్వంత బావ తండ్రి అయినా ఆర్ కొండయ్య కూడా వైకాపాలో చేరారు. ఆయన ప్రకాశం జిల్లాలోని ఓ నియోజక వర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఆయన ఆంధ్ర అంతటా రియల్ ఎస్టేట్ వెంచర్లతో ఆర్కే టౌన్ షిప్ ల పేరిట పాపులారిటీ సంపాదించారు.

Image result for ysrcp and mohan babu

దర్శకుడు వివి వినాయక్ కూడా వైకాపాలోకి వెళ్తారని, ఎన్నికలు దగ్గర చేసి ప్రకటిస్తారని ఓ టాక్ వుంది. అయితే దాన్ని వినాయక్ అంగీకరించలేదు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానం వుందని, కానీ ఏదీ డిసైడ్ చేసుకోలేదని ఆయన అంటున్నారు. హీరో మోహన్ బాబు నేరుగా వైకాపా తరపున రంగంలోకి దిగుతారని టాక్ వుంది. దగ్గర చేసి కానీ ఏ సంగతీ క్లారిటీ రాదు. నిర్మాత పివిపి కి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి వుంది. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి కచ్చితంగా వైకాపా తరపున పోటీలోకి దిగుతారని వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: