‘బాహుబలి 2’ విడుదలై 15 నెలలు దాటిపోయినా రాజమౌళి చరణ్ జూనియర్ లతో మొదలుపెట్టబోయే మల్టీ స్టారర్ ఎప్పుడు మొదలవుతుందో ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాదు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు కూడ తెలియని పరిస్థితిగా మారింది అన్న కామెంట్స్ ప్రస్తుతం హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం విజయేంద్ర ప్రసాద్ ఈ మల్టీ స్టారర్ కోసం మూడు కథలను రెడీ పెట్టినా ఏ కథను ఎంచుకోవాలో రాజమౌళికే తెలియని పరిస్థితి అని అంటున్నారు.

‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించే మూవీ కావడంతో ఈమూవీ పై అత్యంత భారీ స్థాయిలో పెరిగిన అంచనాలు రాజమౌళి కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. రాజమౌళి గతంలో తన సినిమాల కథ విషయంలో చాల క్లారిటీగా ఉండేవాడు అని అతడి సన్నిహితులు అంటారు. దీనితో ఈ మల్టీ స్టారర్ కథ గురించి రాజమౌళి పడుతున్న టెన్షన్ చూసి అతడి సన్నిహితులే షాక్ అవుతున్నట్లు సమాచారం. 
5 Aspects That Made Baahubali India’s Biggest Cinematic Possession
వాస్తవానికి ఈసినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది అని ప్రచారం జరుగుతూ ఉన్నా ఈ అయోమయం వల్ల ఈమూవీ షూటింగ్ డిసెంబర్ కు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా రాజమౌళి ఈసినిమాలో కొంతమంది నూతన నటీనటులకు ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి క్యాస్టింగ్ సెలెక్షన్స్ కోసం రాజమౌళి త్వరలో ఒక ప్రకటన ఇచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
S. S. Rajamouli at the trailer launch of Baahubali.jpg
అదే జరిగితే రాజమౌళి పిలుపుకు దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది నూతన నటీనటులు ఈ క్యాస్టింగ్ కాల్ కు స్పందించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఒకవైపు కథ ఇప్పటికీ ఫైనల్ కాకపోవడం మరొకవైపు నూతన నటీనటుల ఎంపికకు సంబంధించి వార్తలు వస్తూ ఉండటంతో ‘ఆర్ఆర్ఆర్’ పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే చరణ్ జూనియర్ లు కనీసం రాజమౌళి బంధిఖానాలో దాదాపు రెండు సంవత్సరాలు ఉండిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: