నాని హోస్ట్ గా బిగ్ బాస్-2 జనరంజకంగా మారేందుకు నానా హంగామా చేస్తున్నారు. హౌజ్ లో ఉన్న 16 మంది కంటెస్టంట్స్ లో కామన్ మెన్ కేటగిరిలో వచ్చిన నూతన్ నాయుడు కూడా ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత మరో కామన్ మెన్ గణేష్ కూడా వచ్చే వారం ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నాడు.


అసలు ఇంతకీ బిగ్ బాస్ సీజన్ లో కామన్ మెన్ కు ఎందుకు అవకాశం ఇచ్చారు. వారిని సెలబ్రిటీస్ మధ్యలో ఎందుకు చేర్చారు. వారికి వారికి గొడవలు పెట్టి ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నరు అన్నది బుల్లితెర ఆడియెన్స్ ప్రశ్న. మొదటి సీజన్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఎలా నడిపించినా శని, ఆదివారాలు తారక్ వస్తే ఆ కిక్ వేరేలా ఉండేది.


కాని ఈ సీజన్ లో నాని షో కూడా నీరసంగా సాగుతుంది. మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త పర్వాలేదు అనిపించినా తర్వాత తేలగొట్టేశాడనిపిస్తుంది. నాని కూడా మారాల్సిందే అంటున్నారు. బిగ్ బాస్-2 హోస్ట్ గా నాచురల్ స్టార్ అనగానే ఎక్కడ ఎన్.టి.ఆర్ కన్నా బాగా చేసి మార్కులు కొట్టేస్తారో అని కంగారు పడ్డారు.


స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్.టి.ఆర్ కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ తో చేశాడని చెప్పొచ్చు. అంతేకాదు ఎన్.టి.ఆర్ స్టేజ్ మీద అటు ఇటూ తిరగడమే కాదు సందర్భాన్ని బట్టి కింద కూర్చున్న సదర్భాలు ఉన్నాయి కాని నాని మాత్రం అలా చేయట్లేదు. కచ్చితంగా బిగ్ బాస్-2 గురించి ఆడియెన్స్ ఏదో అనుకుంటే మరేదో జరిగిందని అనుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: