శంకర్ రజినీ తో తీస్తున్న సినిమా రోబో 2.0 అయితే ఈ సినిమా రిలీజ్ గురించి మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ సినిమా డైరెక్టర్ కే తెలియదు కాబట్టి అయితే ఈ సినిమా కు అనుకున్న బడ్జెట్ చేయి దాటి పోవడమే మొదటి కారణంగా చెప్పవచ్చు. అయితే ఇంత బడ్జెట్ దాటి పోవడానికి చాలా కారణాలు చెప్పవచ్చు. ప్రీ ప్రొడక్షన్స్ అప్పుడే ఒక ప్లాన్ ప్రకారం అన్ని పక్కాగా ఉండేటట్లు చూసుకోవాలి. బాహుబలి విషయం లో కూడా రాజమౌళి చేసింది అదే. అందుకే బడ్జెట్ కంట్రోల్ లోకి వచ్చింది. అయితే శంకర్ కు ఆ క్లారిటీ లోపించందని టాక్స్ వినిపిస్తున్నాయి. 

Image result for rajamouli and sankar

నిజానికి '2.0' సినిమా మొదలు పెట్టడమే ఓ పెద్ద గందరగోళం. సినిమా షూటింగ్‌ ప్రారంభమవడమూ అంతే. చిత్రీకరణ సమయంలోనూ చాలా ఇబ్బందులెదురయ్యాయి. భారీ బడ్జెట్‌ ఈ సినిమాకి ప్రధాన ప్రతిబంధకంగా మారింది. డబ్బులు ఎలాగో సమకూరాయనుకుంటే, నిర్మాతకీ దర్శకుడికీ వచ్చిన క్లాషెస్‌ కారణంగా విడుదల విషయంలో గందరగోళం తలెత్తింది. దుబాయ్‌లో గ్రాండ్‌గా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చేసేశారు. అంతే, ఆ తర్వాత అనూహ్యంగా '2.0' సినిమా తెరవెనక్కి వెళ్ళిపోయింది. 

Image result for sankar tamil

తాజాగా, ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. 'రజనీకాంత్‌ ఇమేజ్‌ గతంతో పోల్చితే దారుణంగా పడిపోయిన మాట' వాస్తవం. దాంతో డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన క్రమక్రమంగా పెరిగిపోయింది. తమ అడ్వాన్సులు తిరిగిచ్చేయాల్సిందిగా నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి పెంచుతోంటే, ఆటోమేటిక్‌గా నిర్మాత నుంచి దర్శకుడు శంకర్‌ మీదకి ఆ ఒత్తిడి ట్రాన్స్‌ఫర్‌ అవుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: