ఈ  మద్య చిత్ర పరిశ్రమలో వారసత్వపు హీరోలు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  అయితే హీరోల వారసులు మాత్రమే కాదు పారిశ్రామి వేత్తలు, రాజకీయ నేతల తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ త్వరలో సినిమాల్లో కాలు మోపనున్నారు. అయితే  తేజ్ ప్రతాప్ హీరోగా వస్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోయారు..దాని తర్వాత  సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.

ఆ కామెంట్స్  తేజ్ ప్రతాప్ హీరోగా ఎంకరేజ్ కాదు..ఆయన గారు చేసిన పొరపాటుకు క్లాస్ పీకుతున్నారు. వివరాల్లోకి వెళితే తేజ్ ప్రతాప్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో తన సినిమా ‘రుద్ర: ది అవతార్’ త్వరలో రానున్నదని ప్రకటించారు. అయితే ఈ పోస్టులోని ఇంగ్లీషు పదంలో తప్పు దొర్లింది. దీనిని గమనించిన నెటిజన్లు తేజ్ ప్రతాప్‌పై కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఏ చిన్న విషయం అయినా ఈ మద్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ పోస్టులో ‘comming soon’ అని రాశారు. దీనిలో ఆయన స్పెల్లింగ్ తప్పు రాశారు. (సరైన పదం: coming soon) దీంతో పలువురు ముందుగా ఇంగ్లీషు స్పెల్లింగులు నేర్చుకోవాలని తేజ్ ప్రతాప్‌కు సలహా ఇస్తున్నారు.  రాజకీయ బ్యాగ్ గ్రౌండ్ ఉంటే సరిపోతు..సొసైటీలో కాస్త నేర్చుకొని ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఒక యూజర్ ‘అరే.., నైన్త్ ఫెయిల్... ‘comming soon’ కాదు, coming soon. అని కామెంట్ చేయగా, చిత్తూసింగ్ అనే మరో యూజర్ ‘ఇదంతా బాగానే ఉంది... కానీ, యాదవ్ జీ... మీ సోదరుల్లో మీరు మెట్రిక్ పాసయ్యారు. కనీసం ‘comming soon’ ప్లేస్‌లో ‘coming soon’గా మార్చండి అని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: