యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ 150వ చిత్రంగా తెరకెక్కుతున్న యాక్షన్‌ మూవీ కురుక్షేత్రం. అర్జున్‌ సోలో హీరోగా సక్సెస్‌ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఎక్కువగా సహాయ పాత్రలు చేస్తున్న అర్జున్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విలన్‌గా బిజీగా ఉన్నారు. మళ్లీ సోలో హీరోగా ట్రై చేస్తోన్న చిత్రం కురుక్షేత్రం.  రీసెంట్ గా “నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా”, “అభిమ‌న్యుడు” సినిమాల‌తో ఈ జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ కి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. హీరోగా కెరియ‌ర్ మొద‌లు పెట్టిన అతి కొద్దిమందికి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే  150 మూవీ మైలు రాయిని  చేరుకున్నాడు.
కురుక్షేత్రంతో అర్జున్
కురుక్షేత్రం అర్జున్ 150వ మూవీ గా తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల‌కు కాబోతుంది.  అర్జున్  అన‌గానే గుర్తుకు వ‌చ్చే యాక్ష‌న్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.   అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీస్ పాత్ర‌లు చాలా చేసినా ఒక భిన్న‌మైన పోలీస్అధికారిగా ఇందులో క‌నిపించ‌బోతున్నారు.  మ‌ళ‌యాళంలో మోహ‌న్ లాల్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్య‌నాథ‌న్ కురుక్షేత్రం ను అద్యంత ఆస‌క్తిగా మ‌లిచారు

ఊహించ‌ని మ‌లుపులు, ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌తో ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల‌కు అంద‌ని థ్రిల్ల‌ర్ గా కురుక్షేత్రం అల‌రించ‌బోతుంది.   అర్జున్ కెరియ‌ర్ లో భిన్న‌మైన చిత్రం గా మారిన “కురుక్షేత్రం” మోస్ట్ మెమ‌ర‌బుల్ మూవీ కాబోతుంది. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ మూవీ లో  యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో పాటు ప్ర‌స‌న్న‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, సుమ‌న్, సుహాసిని, వైభ‌వ్, శ్రుతి హారి హార‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.


సాంకేతిక నిపుణులు :సమర్పణ- ప్యాషన్ స్టూడియోస్, సంగీతంః ఎస్. న‌వీన్, మాటలు- శశాంక్ వెన్నెలకంటి సినిమాటోగ్ర‌ఫీః అర‌వింద్ కృష్ణ‌,  ఎడిటింగ్ః స‌తీష్ సూర్య‌, పీఆర్వో- జి.ఎస్.కె మీడియా, కో-ప్రొడ్యూసర్-పి.ఎల్ అరుల్ రాజ్, నిర్మాత‌లుః ఉమేష్, సుద‌న్ సుంద‌రం,జయరాం,అరుణ్ వైద్యనాథన్.
స్క్రీన్ ప్లే – ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్ , క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం – అరుణ్ వైద్య నాథ‌న్


మరింత సమాచారం తెలుసుకోండి: