వెండితెరపై ఎన్నో నీతులు చెబుతుంటారు కొంత మంది హీరోలు..కానీ నిజ జీవితంలోకి వచ్చే సరికి ఆచరణకు నోచుకోరు.  ఆ మద్య పలు వివాదాల్లో చిక్కుకున్న హీరో జై తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. పోయిన సంవత్సరం సెప్టెంబర్‌లో ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత కారు నడుపుతూ చెన్నైలోని శాస్త్రి నగర్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు.
నిబంధనలకు విరుద్దంగా
ఆ కేసులో అతడికి జరిమానా విధించడమే కాకుండా ఆరు నెలలపాటు తన లైసెన్స్‌ను కోర్టు సస్సెండ్ చేసింది. మరో సందర్భంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ వాహనాన్నే ఢీకొట్టాడు. ఇకనైనా మారుతాడనుకొంటే మరోసారి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.  ట్రాఫిక్ రూల్స్‌కు వ్యతిరేకంగా జై మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్‌లో తన కారు హారన్‌ను అధిక ధ్వనితో మోగించుకుంటూ వెళ్లడంతో  ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.
 క్షమాపణలు కోరిన జై
దీంతో ట్రాఫిక్‌ పోలీసులు 'జై' కారును వెంబడించి అడ్డుకున్నారు. కారు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిగి  ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై తీసుకునే చర్యల గురించిన అవగాహన వీడియోను చూపించారు. రోడ్డు పైకి వస్తే..సినిమా షూటింగ్ అనుకుంటున్నాడా..ఇలాంటి వారి వల్ల రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని నెటిజన్లు హీరో జై పై విమర్శలు సందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: