ప్రపంచలో పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌ తండ్రి జోయ్‌ జాక్సన్‌ ఇక లేరు.  పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతూ, ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. జోయ్ మనవళ్లు రాండీ జాక్సన్ జూనియర్, టై జాక్సన్ లు ఈ విషయాన్ని వెల్లడించారు.  1928 జూలై 26న అమెరికాలోని అర్కన్‌సస్‌లోని ఫౌంటెన్‌హిల్స్‌లో జోయ్‌ జాక్సన్‌ జన్మించారు.

ఆయనకు భార్య కేథరిన్‌ మరియు 11 మంది సంతానం.  వీరిలో పుట్టగానే ఓ బిడ్డ చనిపోగా, మైకేల్‌ జాక్సన్‌ 8వ సంతానం. చిన్నతనంలోనే పిల్లల్లో ఉన్న మ్యూజిక్ ట్యాలెంట్ ను గుర్తించి, వారిని ప్రోత్సహించాడు. అందరకీ మేనేజర్ గా వ్యవహరిస్తూ, మంచిచెడ్డలు చూసుకున్నారు.తన తండ్రి క్రమశిక్షణే తమ ఎదుగుదలకు కారణమని పలు సందర్భాల్లో మైఖేల్ జాక్సన్ చెప్పారు.  తండ్రిగా కంటే ఓ మేనేజర్‌గానే జోయ్‌ తమ పట్ల కఠినంగా వ్యవహరించేవారని, ఆ క్రమశిక్షణే తమ ఎదుగుదలకు సహకరించిందని మైకేల్‌ జాక్సన్‌ పలు ఇంటర్వ్యూల్లో చెప్పటం చూశాం.

 పాప్‌ రారాజుగా వెలుగొందిన మైకేల్‌ జాక్సన్‌ (50) 2009, జూన్‌ 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జోయ్‌ చిన్న కూతురు జానెట్‌ జాక్సన్‌(52) కూడా పాప్‌ దిగ్గజమే. జోయ్‌కు పలు అవార్డులు కూడా దక్కాయి. జోయ్ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. 

Michael Jackson's father passed away

మరింత సమాచారం తెలుసుకోండి: