హీరోయిన్స్ మధ్య పోటీ పెరిగి పోవడంతో కాజల్ కెరియర్ అయిపోయింది అంటూ అనేకసార్లు వార్తలు వచ్చాయి. అయితే అలా వార్తలు వచ్చిన ప్రతిసారి కాజల్ మరింత రెచ్చిపోయిన ఉత్సాహంతో ఆమె కెరియర్ బౌన్స్ బ్యాక్ అవుతున్న నేపధ్యంలో ఆమె ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు గడిచిపోతున్నా కాజల్ కెరియర్ ఇంకా టాప్ గేర్ లో కొనసాగుతూనే ఉంది. 
Kajal Agarwal Photoshoot Latest
ఇలాంటి పరిస్థుతులలో ఈమెకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది. గత కొంత కాలంగా టాప్ హీరోలతో సినిమాలు తీస్తు బిజీగా ఉన్న డివివి దానయ్య కొడుకును హీరోగా చేయాలని దానయ్య ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి దర్శకుడు తేజా దర్శకత్వం వహించడానికి అంగీకరించిన నేపధ్యంలో ఈ మూవీకి కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు వచ్చినట్లు తెలుస్తోంది. 
Beautiful Actress Kajal Aggarwal Latest Cute pics
అయితే ఒక కొత్త హీరోతో కాజల్ ను నటింపచేయడానికి జరిగిన ప్రయత్నాలలో ఆమెకు రెండు కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిన నేపధ్యంలో వచ్చిన అవకాశాన్ని వెంటనే కాజల్ ఒప్పుకుని ఈ భారీ ఆఫర్ కు ఓకె చెప్పిందని సమాచారం. 

ఈమధ్య కాలంలో చాలామంది నిర్మాతలు తమ కొడుకులను హీరోలుగా మార్చాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో కొందరి నిర్మాతల కొడుకులో విజయం కూడ సాధిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో దానయ్య ఈ లిస్టులో చేరి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జూనియర్ చరణ్ లతో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ చేస్తున్న దానయ్య ఆ ప్రాజెక్ట్ తో పాటు తన కొడుకును హీరోగా మార్చే ప్రయత్నాలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: