తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరో పవన్ కళ్యాన్ బద్రి చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చారు.  ఇదే సమయంలో పవన్ సహనటి రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఇద్దరు సంతానం..కొంత కాలం తర్వాత అభిప్రాయ భేదాలతో చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు.  విడాకులు తీసుకున్న తర్వాత వీరి మద్య స్నేహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన పిల్లల ఆలనా పాలన పవన్ చూస్తూనే ఉన్నారు.  ఈ మద్య రేణు దేశాయ్ ద్వితీయ వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యింది.
Image result for renu desai eagnemtn
తన ఎంగేజ్ మెంట్ అయిన విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..రేణు దేశాయ్ కి పవన్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే..నేను ఓ నూత‌న జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ స‌మ‌యంలో ఒక నిర్ణయానికి వ‌చ్చాను. ట్విట‌ర్ నుంచి వైదొలిగి ఆ నెగిటివిటీకి దూరంగా ఉండ‌ద‌ల‌చుకున్నాను. అదే స‌మ‌యంలో న‌న్ను అర్థం చేసుకుని, నా మంచి కోరుతూ ప్రతికూల ప‌రిస్థితుల్లో నాకు తోడుగా నా వెంట ఉన్న ప్రతీ ఒక్కరికీ నా కృత‌జ్ఞత‌లు’’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె తన ట్విటర్ అకౌంట్‌ను క్లోజ్ చేశారు. అయితే రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచి తప్పుకోవడానికి కారణం పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ‘మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రాకూడదు. ఏం? పెళ్లి చేసుకోలేకపోతే బతకలేవా వదినా.. లోకంలో ఎంతమంది పెళ్లిచేసుకోకుండా ఒంటరి జీవితం గడపడం లేదు? నువ్వు ఆదర్శంగా ఉండాలి..  నువ్వు పెళ్లాడితే పవన్ కల్యాణ్ అభిమానులుగామేం జీర్ణించుకోలేం.. నువ్వు రెండో పెళ్లి అంటూ పవన్ గారిని ఇబ్బంది పెడుతున్నావు.. ‘ అంటూ రకరకాల కామెంట్లతో అభిమానులు విరుచుకుపడుతున్నారు.
Image result for renu desai eagnemtn
ప్రతిరోజూ ట్విట్టర్ లో వచ్చే కామెంట్స్ కి ప్రతిక్షణం స్పందించడం రేణు దేశాయ్ కి ఇష్టం లేకపోవడం..త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టే ఆమెకు ఇవి ఇబ్బందులకు గురి చేస్తాయని భావించి ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసి ఉండవొచ్చని కొంత మంది అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: