బిగ్ బాస్ తొలి సీజన్ ఎలా ఉటుంది ఏంటి అన్నది ఎలాంటి ఐడియా లేదు. హిందిలో వస్తున్నా అంత దృష్టి పెట్టేంత తీరిక లేదు. 70 రోజులు ఒకే హౌజ్ లో ఎవరి సహాయం లేకుండా ఎవరి పనులు వారు చేస్తూ ఉండాలి. జస్ట్ ఇదే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ మొదటి సీజన్ స్టార్ట్ అయ్యింది. విన్నర్ డెశిషన్ ఎలా ఉంటుంది.


వారం వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా సాగుతుంది.. ఈ విషయాల మీద మొదటి సీజన్ కంటెస్టంట్స్ కు ఏమాత్రం ఆలోచన లేదు. అయితే ఒక సీజన్ ముగిసాక సెకండ్ సీజన్ వారికో రిఫరెన్స్ ఏర్పడింది. అందుకే ఈసారి కంటెస్టంట్స్ ఎవరు ఇంట్లో దిగులు పడిన సందర్భాలు కనిపించలేదు.


మొదటి సీజన్ పూణేలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో సెట్ వేస్తే.. ఈ సీజన్ ఏకంగా అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్-2 సెట్ వేశారు. అందుకే మనం ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాం అన్న భావనలో ఉన్నారు కంటెస్టంట్స్. అంతేకాదు హౌజ్ లో ఎలిమినేషన్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి హౌజ్ లోకి వచ్చే ముందే ఇద్దరు ముగ్గురు కంటెస్టంట్స్ ఓ సోషల్ టీంను ఏర్పరచుకున్నారట. హౌజ్ లో ఉన్నా వారి టీం వారి ఎలిమినేషన్ నుండి కాపాడటమే వారి ఉద్దేశమట. 


దీని కోసం కొంత డబ్బులిచ్చి మరి మెయింటైన్ చేస్తున్నారట. ఇలా చేసే వారిలో తేజశ్వి పేరు వినిపిస్తుంది. అంతేకాదు టివి-9 యాంకర్ దీప్తి కూడా సోషల్ టీం ఏర్పరచుకుందని టాక్. మొత్తానికి బిగ్ బాస్-2 టైటిల్ గెలిచేందుకు వీరి స్కెచ్ ఏమాత్రం ఫలిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: