Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 5:15 am IST

Menu &Sections

Search

పవన్ ఫ్యాన్స్ పై శ్రీరెడ్డి ఫైర్!

పవన్ ఫ్యాన్స్ పై శ్రీరెడ్డి ఫైర్!
పవన్ ఫ్యాన్స్ పై శ్రీరెడ్డి ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించింది.  ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదుర్శన చేయడంతో అందరి చూపు ఆమెపై పడ్డాయి. శ్రీరెడ్డి పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు పలికాయి.  అయితే తన పోరాటానికి ఇక ఎదురు లేదనుకున్న శ్రీరెడ్డి ఒక్కసారే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని తిట్టడంతో ఒక్కసారే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్లు.   కాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతున్న శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడిని పర్సనల్ గా టార్గెట్ చేయడం ఆమెకు సహకరించిన వారికి కూడా నచ్చకపోవడంతో ఆమెకు వ్యతిరేకం అయ్యారు. 
pawan-kalyan-ex-wife-renu-desai-marriage-actress-s
మీడియా సైతం శ్రీరెడ్డిని పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యింది శ్రీరెడ్డి.  అయితే ఇంట్లో ఉండి కూడా సోషల్ మాద్యమాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ రోజూ వార్తల్లో నిలుస్తుంది శ్రీరెడ్డి.  తాజాగా  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ను వేధిస్తూ ట్రోలింగ్ చేసిన పవన్ అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. రేణు కు బాసటగా నిలుస్తూ పవన్ అభిమానులపై ధ్వజమెత్తింది.
pawan-kalyan-ex-wife-renu-desai-marriage-actress-s

'ఆమె చాలా చిన్న వయసులో విడాకులు తీసుకున్నారు. దానికి కారణం ఏంటనే దానిపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకు లేదని' అన్నది.  పూణేలో ఆమె ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నారని, ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎవరికైనా తెలుసా అని నిలదీశారు.  ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మద్దతుగా నిలిచారా అని ప్రశ్నించారు.