తెలుగులో మంచి అభిరుచితో.. తెలుగుదనం ఉన్న సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టాచెమ్మా’.. ‘అంతకుముందు ఆ తరువాత’.. ‘జెంటిల్ మన్’..‘అమీతుమీ’ లాంటి చిత్రాలు ఆయన అభిరుచిని చాటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రమే ‘సమ్మోహనం’. ఎప్పటి నుంచి మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి అద్భుతమైన విజయాన్ని అందించారు.    హీరోయిన్ గా అదితి రావు హైదరీ కూడా అద్భుతంగా నటించి మెప్పించింది.  ఈ చిత్రంలో అన్ని పాత్రలకు తగిన న్యాయం జరిగింది. 
Image result for సమ్మోహనం
సినిమా హీరోయిన్లు అంటే పడని ఓ యువకుడు సినీ నటిని ప్రేమించి ఆమె ప్రేమను ఎలా పొందుతాడు అన్న కాన్సెప్ట్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  సమ్మోహనం’కు సాంకేతిక నిపుణులు కూడా బలంగా నిలిచారు. ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ మరోసారి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాను నడిపించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది.  ఈ చిత్రానికి ప్రేక్షకులే కాదు టాలీవుడ్ వర్గం కూడా తెగ మెచ్చుకుంది.  తాజాగా ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి చూసి తెగ మెచ్చుకున్నాడు.
Image result for సమ్మోహనం
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్‌పై కసరత్తులు చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలో సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రాన్ని చూసి, మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. సీనియర్ యాక్టర్ నరేశ్ నవ్వించారు. టీం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ ఆయన కామెంట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: