భారతీ చిత్ర పరిశ్రమలో ఈ మద్య బయోపిక్ లకు పెద్ద పీట వేస్తున్నారు. జీవించిన, చనిపోయిన నటీనలుటు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారి జీవిత కథ ఆధారంగా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.   తెలుగు లో సావిత్రి బయోపిక్ ‘మహానటి’ అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.  తాజాగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది.  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయ్యింది సంజు చిత్రం.   

ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ట్రైలర్ విడుదల అయ్యాక ఆ అంచనాలు మరింతగా పెరిగాయి . దాంతో సంజు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూసారు .  భారీ అంచనాలు ఉండటంతో భారీ ఓపెనింగ్స్  బాగా వచ్చాయి.
Image result for sanju movie
సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . రణబీర్ కపూర్ , సోనమ్ కపూర్ , అనుష్క , మనీషా కొయిరాలా , పరేష్ రావెల్ ప్రధాన పాత్రల్లో నటించిన సంజు చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు .  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో దుమ్మురేపుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: