పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవడం పవన్ ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఆమె మీద విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వారి దాటికి భయపడే రేణు దేశాయ్ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయాల్సి వచ్చింది.


ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రాంలో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ రేణుని ఎటాక్ చేస్తున్నారు. తాను ఎంత మర్యాదగా చెబుతున్నా సరే వినిపించుకోకుండా ఉంటున్న పవన్ ఫ్యాన్స్ పై ఉగ్రరూపం చూపించింది రేణు దేశాయ్. పవన్ తో పెళ్లి, డివోర్స్ విషయాలను వెళ్లడిస్తే ఫ్యాన్స్ అంతా నోరు మూసుకుంటారని షాకింగ్ కామెంట్స్ చేసింది.  


అయితే రేణు దేశాయ్ అన్న కామెంట్లను బట్టి చూస్తే ఆమె ఏం చెప్పాలనుకున్న విషయం ఏంటి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పవన్ తో డివోర్స్ విషయం బయటపెడితే ఫ్యాన్స్ నోళ్లు మూసుకుంటారని చెప్పడంతో అసలు ఆ డివోర్స్ ఎవరు కావాలనుకున్నారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు.


ఈమధ్యనే రెండో పెళ్లికి నిశ్చితార్ధం చేసుకున్న రేణు దేశాయ్ తనకు పవన్ ఫ్యాన్స్ తలనొప్పిగా మారారన్న భావనలో ఉంది. అందుకే వారికి షాక్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తుంది. పవన్ తో విడిపోయిన విషయాలను బయట పెట్టకుండా ఉన్నందుకు ఫ్యాన్స్ అంతా తనకు కృతజ్ఞతగా ఉండాలని కూడా అంటుంది రేణు దేశాయ్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: