తెలుగు ఇండస్ట్రీలో వెన్నెల చిత్రంతో పరిచయం అయిన వెన్నెల కిషోర్ ఇప్పుడు టాప్ కమెడియన్ గా చెలామని అవుతున్నాడు.  తనదైన మ్యానరీజంతో కడుపుబ్బా నవ్విస్తున్న వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో కామెడీ పంచ్ లు విసురుతుంటారు.  ట్విట్టర్లో అతను తన ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు తన స్టైల్లో కామెడీ పంచుతుంటారు.  తన కామెడీ టైమింగ్ చూపించే ఫొటోలతో వినోదం పంచుతుంటాడు.
Image result for vennela kishore
ఇంట్రెస్టింగ్ డిస్కషన్లు పెట్టి జనాల్ని ఎంగేజ్ చేస్తుంటాడు. తాజాగా అతను తాను నటిస్తున్న ‘ముద్ర’ షూటింగ్ సందర్భంగా తీసిన ఒక ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు.  తాను పంపించిన ఫోటోలో  వెన్నెల కిషోర్ అండ్ టీం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కిషోర్ ఫోన్ పట్టుకుని ఉంటే.. అతడి ముందున్న హీరో నిఖిల్.. సీనియర్ నటి ప్రగతి అతడి వైపు చేతులు చూపిస్తున్నారు.
Image result for vennela kishore
కిషోర్ పక్కన కమెడియన్ విద్యు రామన్ కూడా ఉంది. కిషోర్ ఏదో తప్పు చేస్తే అందరూ అతడిని నిందిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో చూస్తే. ఈ ఫొటోకు ‘ముద్ర సెట్స్లో నన్ను నిందిస్తున్నారు’ అని కామెంట్ పెట్టాడు కిషోర్.  ప్రస్తుతం వెన్నెల కిషోర్  ట్విట్టర్లో 13 లక్షల మంది అనుసరిస్తుండటం విశేషం. మనోడు చేసిన ట్విట్ కి నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.   కిషోర్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: