ఇండస్ట్రీలో పెద్దదైన మెగా ఫ్యామిలీకి సొంతంగా చిన్న స్టూడియో కూడా లేదు. బడా నిర్మాణ సంస్థ చేతిలో ఉన్నా పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా సినిమాలు చేసినంత వరకే బిజినెస్.. అయితే మిగతా వారి లెక్క వేరు. సురేష్ బాబు రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియోతో పాటుగా రోజు షూటింగులతో బిజీగా ఉండే నాగార్జున అన్నపూర్ణ స్టూడియో ఎంతో పెద్దవి.


ఎన్నో వేల కొద్ది సినిమాలు ఈ స్టూడియోల నుండి వస్తున్నాయి. అయితే మెగా ఫ్యామిలీకి ఏ స్టూడియో లేదు. అయితే మెగా స్టూడియోకి నడుం కట్టాడట రాం చరణ్. దాదాపు ఓ క్రికెట్ టీంకు సరిపడ హీరోలను ఇంట్రడ్యూస్ చేసిన మెగా కాంపౌండ్ లో తమకంటూ ఓ స్టూడియో ఉంటే బెటర్ అని చరణ్ భావిస్తున్నాడట.


అందులో భాగంగా ఓ స్టూడియోని నిర్మించాలని చూస్తున్నాడట. అందుకు గాను ఓ 22 ఎకరాల స్థనం కూడా చూసినట్టు తెలుస్తుంది. హీరోగానే కాదు నిర్మాతగా స్పీడ్ మీద ఉన్న చరణ్ ఇప్పుడు స్టూడియో ఆలోచన చేయడం గొప్ప విషయం. తప్పకుండా మెగా స్టూడియో అందరికి ఉపయోగపడుతుంది.


ఎలాగు ఒక హీరో కకపోతే మరో మెగా హీరో సినిమాలు ఎప్పుడూ స్జూటింగ్ జరుగుతాయి కాబట్టి ఇక మెగా స్టూడియోలకు తిరుగు ఉండదు. ప్రస్తుతం సైరా షూటింగ్ లో నిర్మాతగా అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్న రాం చరణ్ మెగా స్టూడియో విషయంలో సీరియస్ డిస్కషన్స్ మొదలుపెట్టాడట. త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: