బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో మంచి ఫామ్ లోకి వచ్చాడు షకలక శంకర్.  అదృష్టం కొద్ది వెండితెరపై చాన్సులు దక్కించుకున్నాడు.  కమెడిన్ గా కొనసాగుతున్న షకలక శంకర్ అనుకోకుండా హీరోగా యూటర్న్ ఇచ్చాడు.  ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఈ  చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది.  అయితే ఈ చిత్రంతో పాటు  మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈనగరానికి ఏమైంది’ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. 
Image result for shakalaka shankar
 అయితే ఇండస్ట్రీలో  బ్రహ్మానందం, ఆలీ లు హీరోలుగా నటించినా..తర్వాత కమెడియన్లుగా కంటిన్యూ అయ్యారు.   వీరి బాటలోనే కమెడియన్ సునీల్ నడిచాడు...ప్రస్తుతం కామెడీ హీరోగా కొనసాగుతున్నారు.  అంతే కాదు తమ కామెడీతో అందరి మనసులు దోచిన శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి లు కూడా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక షకల శంకర్ కూడా హీరోగా ‘శంభో శంకర’సినిమాతో నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.  ఇక శంభోశంకర సినిమా విడుదలకు ముందు షకలక శంకర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 
Image result for shakalaka shankar
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్, దిల్ రాజుతో పాటు మరికొంతమంది ప్రముఖులపై నానా విమర్శలు చేశాడు. ఆ సమయంలో మనోడు కామెడీగా తీసుకుంటారనుకున్నా విషయం మాత్రం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది.   షకలక శంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పదే పదే చూపించడం కొంత మందికి నచ్చలేదు.  ఇదిలా ఉంటే..శంభోశంకర డిజాస్టర్ అయింది. అక్కడితో ఆగదు ఈ వ్యవహారం. ఇప్పుడు కమెడియన్ గా షకలక శంకర్ కెరీర్ కూడా చిక్కుల్లో పడింది. ఇండస్ట్రీలో అతడికి అవకాశాలు కూడా తగ్గుతాయని అంటున్నారు ఫిలిమ్ వర్గాలు.   పాపం షకలక శంకర్ తాను తీసుకున్న గోతిలో తాను పడినట్లయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: