సినిమా అనేది ఎవరు ఎలా తీసినా ఫైనల్ గా ఆడియెన్స్ మెప్పు పొందితేనే అది హిట్.. లేదంటే ఫ్లాప్. అయితే మధ్యలో వెబ్ సైట్స్ ఇచ్చే రివ్యూలు గట్రా సినిమా మీద ఏమేరకు ప్రభావం చూపిస్తాయో అందరికి తెలిసిందే. సినిమా బాగుంది అంటే బాగుందని.. లేదంటే బాగాలేదని రాయడమే రివ్యూయర్స్ పని.. అయితే విశ్లేషణలో ఎవరి స్టైల్ లో వారు రాసుకొస్తారు.  


సినిమా హిట్ అని చెప్పిన రివ్యూస్ గురించి మాట్లాడని దర్శక నిర్మాతలు.. సినిమా అటు ఇటుగా ఉందని అంటే మాత్రం రివ్యూయర్స్ మీద ఎటాక్ చేస్తారు. అసలు ఏ అర్హత ఉందని రివ్యూస్ రాస్తారంటూ కామెంట్ చేస్తారు. అదే మాట అసలు ఏ అర్హత ఉందని సినిమా తీస్తారని వీరు కూడా అడిగే ఛాన్స్ ఉంది. 


అయితే పెద్ద దర్శకులు సైతం సినిమాల రివ్యూల గురించి లైట్ తీసుకుంటుంటే.. రెండు సినిమాలు చేశాడో లేదో రివ్యూయర్స్ మీద ఫైర్ అవుతున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈయన ఆ సినిమా రివ్యూయర్స్ మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. 


తన సెకండ్ మూవీగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా రివ్యూస్ మీద మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. నచ్చిన వాళ్లు పొగుడుతూ రివ్యూ రాయగా.. నచ్చని వాళ్లు విమర్శిస్తూ రాశారు. అంతమాత్రానికే రివ్యూయర్స్ కు ఏ అర్హత ఉందని రివ్యూ ఇస్తారంటూ క్లాస్ పీకుతున్నాడు. ఏదో ఒకరోజు రివ్యూల పై తానో రివ్యూ రాస్తానని చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్. ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ ప్లే, రైటింగ్ మీద సున్నా అవగాహనతో రివ్యూస్ రాస్తున్నారని అన్నాడు. తన దృష్టిలో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేసిన వారు రివ్యూస్ రాయాలని అన్నారు. బాహుబలి లాంటి సినిమాను విమర్శించేలా రివ్యూ రాసినా రాజమౌళి సైతం నోరు మెదపలేదు. కాని రెండో సినిమాకే తరుణ్ ఇలా రియాక్ట్ అవడం ఆశ్చర్యంగా ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: