బిగ్ బాస్-2 మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. శనివారం నామినేట్ అయిన ఐదుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్ లోకి పంపించేశాడు నాని. ఇక ఉన్నది ముగ్గురు అందులో కిరీటి, గణేష్, గీతా మాధురి ఉన్నారు. అయితే గీతా మాధురి హౌజ్ లో ఉన్న అందరి సెలబ్రిటీస్ కన్నా హయ్యెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ.


అందుకే ఆమెను మరికొద్ది రోజులు హౌజ్ లో ఉంచే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఆమె కాదనుకుంటే కిరీటి, గణేష్ ల మధ్య ఎలిమినేషన్ ఉంటుంది. లాస్ట్ వీక్ కంటే గణేష్ ఈ వారం హౌజ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తన అమాయకత్వంతో గణేష్ అందరి మనసులను గెలిచేస్తున్నాడు. 


గణేష్, కిరీటిలలో లాస్ట్ వీక్ గ్రాఫ్ చూస్తే మాత్రం గణేష్ కూడా సేఫ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ విధంగా చూస్తే ఈ వారం అదే మూడవ ఎలిమినేటర్ గా హౌజ్ నుండి కిరీటి దామరాజు బయటకు వచ్చేస్తాడని అనిపిస్తుంది. బిగ్ బాస్-2 అనుకున్నంత సక్సెస్ కాకున్నా నాని మాత్రం తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.


ఈ వారం గణేష్ ఎలిమినేట్ అయితే కామన్ మెన్ మీదే బిగ్ బాస్ దృష్టి పెట్టాడని అనిపిస్తుంది. ఇప్పటికే సంజన, నూతన్ నాయుడులు వెంట వెంట ఎలిమినేట్ అయ్యేసరికి కామన్ మెన్ కు బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడన్న కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: