సూపర్ స్టార్ మహేష్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తూ కెరియర్ లో మరింత ఉత్సాహం తెచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అల్లరి నరేష్. హీరోగా తను ఈమధ్య చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను అందుకోవడం లేదు. మహేష్ 25వ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు అల్లరోడు.


సినిమాలో తన పాత్ర పేరు రవి. జూన్ 30న మా రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మహేష్ 25వ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేశాడు. అతనితో పనిచేయడం గొప్ప అనుభూతి అంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ సినిమా కోసం నరేష్ కూడా బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.


ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె లీడ్ హీరోయిన్ కాగా సమ్మోహనంతో ఆడియెన్స్ మనసులు గెలిచిన అదితి రావు హైదరి కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. 


కొన్నాళ్లుగా ఒకే లుక్ లో సినిమాలు చేస్తున్న మహేష్ 25వ సినిమా స్పెషల్ గా ఉండేలా మేకోవర్ తో కనిపిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా వస్తుంది. 2019 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: