అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ దశాబ్ధం పైగా సినిమాలు చేస్తూ వస్తున్నా చెప్పుకునేందుకు ఒకటి రెండు సినిమాలు తప్ప ఏవి లేవు. మరో పక్క యువ హీరోలంతా వెరైటీ సినిమాలతో హిట్లు కొడుతుంటే సుమంత్ మాత్రం వెనుకపడే ఉన్నాడు. అయితే రీసెంట్ గా మళ్లీ రావా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుమంత్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.


ఇక మరోపక్క ఈమధ్యనే ఇదం జగత్ అంటూ ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇదవరకు కన్నా సుమంత్ కథల విషయంలో తన పంథా మార్చుకునాడని అనిపిస్తుంది. ఇదం జగత్ కూడా ఫస్ట్ లుక్ తో మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఇక ఇప్పుడు మరో సినిమా ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు సుమంత్. 


సంతోష్ జాగర్లముడి డైరక్షన్ లో వస్తున్న సినిమా సుబ్రమణ్యపురం. ఫస్ట్ లుక్ అది కూడా తన బ్యాక్ లుక్ తో కనిపించి అలరించాడు సుమంత్. అక్కినేని హీరోగా ఇన్నాళ్లు ఫాంలో లేని సుమంత్ సడెన్ గా ఇలా వరుస సినిమాలు చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. సుబ్రమణ్యపురం సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది.  


సుమంత్ 25వ సినిమాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ అంచనాలు పెంచిందని చెప్పాలి. నిఖిల్, చందు మొండేటిల కార్తికేయ సినిమాగా అనిపిస్తున్న ఈ సుబ్రమణ్యం పురం ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదం జగత్, సుబ్రమణ్యంపురం ఈ రెండు సినిమాలతో కచ్చితంగా మళ్లీ సుమంత్ ఫాం కొనసాగించేలా కనిపిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: