బిగ్ బాస్-2 మొదలైన టైంలో సెలబ్రిటీస్ తో పాటుగా ముగ్గురు కామన్ మెన్ ను హౌజ్ లోకి పంపించారు. అయితే మొదటి రెండు ఎలిమినేషన్స్ లో సంజనా, నూతన్ నాయుడులను ఎలిమినేట్ చేసేసరికి కామన్ మెన్ పై బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడని అందరు అనుకుంటున్నారు.  


మూడవ ఎలిమినేషన్ లో కూడా కిరీటి, గీతా మాధురి, తేజశ్విలతో పాటుగా గణేష్ కూడా ఉన్నాడు. ఈసారి కామన్ మెన్ కే ఎసరు పెట్టారని అందరు అనుకున్నరు. అందుకే గణేష్ కు సింపతీ ఓట్స్ చాలా వర్క్ అవుట్ అయ్యాయి. ఆ దెబ్బతో కిరీటీ బయటకు రావాల్సి వచ్చింది. 


అవును బిగ్ బాస్-2 లో మూడవ ఎలిమినేటర్ గా కిరీటి దామరాజు హౌజ్ నుండి బయటకు వచ్చాడు. గణేష్ వెళ్తే పరిస్థితి ఎలా ఉండేదో కాని కిరీటీ ఎక్సిట్ అవడంతో ఆడియెన్స్ లో కూడా కామన్ మెన్ కు న్యాయం జరిగింది అన్న భావనకు వచ్చారు. అయితే ఈ వారం తప్పించుకున్న గణేష్ తర్వాత వారం ఎలిమినేషన్ లో ఉంటాడా ఉండడా అన్నది చూడాలి. 


నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ ఈ వారం బాగానే ఆకట్టుకుంది. శని, ఆదివారాల్లో హౌజ్ మెట్స్ తో నాని ఆటలు అందరిని అలరించాయి. ఇక కిరీటిని బోన్ లో పెట్టి తన మీద వచ్చిన అభియోగాలను సరిదిద్ధుకునే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి నాని ఇప్పుడిప్పుడే బిగ్ బాస్-2 పై ఆసక్తి కలిగేలా చేస్తున్నాడని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: