టాలీవుడ్ లో సంపూర్ణేష్ బాబు అనే పేరు వినిపిస్తే..నవ్వు ఆగదు.  ‘హృదయకాలేయం’ సినిమాతో తనదైన కామెడీ మార్క్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు.  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అంటూ ఆయనకు ఆయనే బిరుదు ఇచ్చుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది.   వాస్తవానికి ‘హృదయకాలేయం’సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోయినా..ఆ సినిమాకు మనోడు తీసుకు వచ్చిన హైప్ మామూలుగా లేదు. 
Image result for sampoornesh babu
దాంతో హీరోగా కూడా మంచి ఫామ్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు.  ఆ తర్వాత సింగం 123 సినిమా కూడా మరోకామెడీ జోన్ లోకి వెళ్లింది.  ఇక హీరోగానే కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.  ఆ మద్య సంపూ నటించిన ‘కొబ్బరిమట్ట’సినిమా రిలీజ్ కాబోతుందని నానా హంగామా చేశారు..కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.  తాజాగా సంపూర్ణేశ్‌బాబు, సలోని జంటగా ఆర్‌.కె. ఫిలిం ఫ్యాక్టరీస్‌ పతాకంపై ఎం.రాజ్‌కుమార్‌ రూపొందించనున్న చిత్రం ‘టక్కరి దొంగ.. చక్కని చుక్క’. ‘‘లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది.
Image result for sampoornesh babu kobbari matta
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్  పనులు పూర్తయ్యాయి. నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉంటాయి’’ అని దర్శకుడు తెలిపారు. జులై రెండోవారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని నిర్మాత రాజ్‌కుమార్‌ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: మరుదూరి రాజా, పాటలు: చంద్రబోస్‌, సంగీతం-వందమాతరం శ్రీనివాస్‌, కెమెరా: పైడాల శ్రీనివాస్‌, ఎడిటింగ్‌-గౌతంరాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: