సంజయ్ దత్ జీవితం ఆధారంగా రుపొంధించిన బయోపిక్ ‘సంజు’ కలెక్షన్స్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల కలెక్షన్స్ మార్కును దాటింది అనివార్తలు వస్తున్న మేపధ్యంలో ఈకలెక్షన్స్ సునామీని చూసి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతోంది తనజీవితంలో ఇప్పటివరకు తాను హీరోయిన్స్ వేశ్యలతో కలిపి 350 మందితో పడుకుని ఉంటాను అని సంజయ్ దత్ చెప్పిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 
తల్లి సమాధి వద్దకు అని..
ఇదిచాలదు అన్నట్లుగా సంజయ్ రొమాంటిక్ జీవితానికి సంబంధించిన విషయాలను ‘సంజూ’ దర్శకుడు రాజ్‌ కుమార్ హిరానీ ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ దత్ గురించి మరొక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. సంజయ్ దత్ తన కెరియర్ మంచి తారా స్థాయిలో ఉన్నరోజులలో తనతో అఫైర్ సాగించే ప్రతీ అమ్మాయిని సంజయ్ శ్మశానానికి తీసుకెళ్లేవాడట. అంతేకాదు అమ్మాయిల సానుభూతి పొందేందుకు చాలా చిట్కాలు ఉపయోగించేవాడు అన్న విషయాన్ని కూడ  రాజ్ కుమార్ హిరాని తన ఇంటర్వ్యూలో తెలియచేశాడు. తనతోపాటు శ్మశానికి వచ్చిన అమ్మాయిలతో నిన్ను మాఅమ్మ సమాధి వద్దకు తీసుకొచ్చాను. 
 గర్ల్‌ఫ్రెండ్స్‌తో సంజూ అబద్దాలు
మా అమ్మ ఈలోకంలో లేదు ఆమెను పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అంటూ ఆఅమ్మాయిలతో  ఎమోషనల్ అయిపోయి సంజుతో అఫైర్‌ లో మునిగిపోయే విచిత్రమైన పద్ధతులు అనుసరించే వాడన్న షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఇందే సందర్భంలో రాజకుమార్ హిరాని మాట్లాడుతూ ఎవరైన అమ్మాయి తనను మోసగిస్తే సంజయ్ దత్  చాల దారుణంగా ప్రవర్తించేవాడు అన్న మరో కోణాన్ని  బయట పెట్టాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని. సంజయ్ దత్ తన జనరేషన్‌ లోని ప్రతీ హీరోయిన్‌ తో డేటింగ్ చేసిన విషయాన్ని బయట పెడుతూ తనకంటే సీనియర్లైన హీరోయిన్లతో కూడా అఫైర్లు నడిపిన చరిత్ర సంజయ్ దత్ సొంతం మరో షాకింగ్ కోణం బయట పెట్టాడు ఈమూవీ దర్శకుడు. 
రేస్-3 మూవీని బీట్ చేసిన ‘సంజు‘
ఇది ఇలా ఉండగా ఈమూవీ మొదటి మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో  ఈమూవీకి ఓవర్సీస్ లో కలెక్షన్స్ సంచలనాలు కొనసాగుతున్నాయి.  దీనికితోడు ఈమూవీ  ఆస్ట్రేలియాలో ‘బాహుబలి 2’ ‘దంగల్’ రికార్డులను బ్రేక్ చేయడం మరింత సంచలనంగా మారింది. ఏది ఏమైనా సంజయ్ దత్ లోని చీకటి కోణాలను ఈతరం ప్రేక్షకులకు పరిచియం చేస్తూ రాజ్‌కుమార్ హిరానీ వందల కోట్లు కొల్లగొడుతూ ఒక సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: