బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ మధ్య దూరానికి కారణం ఏంటి అన్నది నందమూరి ఫ్యాన్స్ కే కాదు వారిద్దరితో సన్నిహితంగా ఉండే వారికి అంతుచిక్కని ప్రశ్న. పోనీ ఎవరో ఒకరు పూనుకునే ఆలోచన చేసినా బాలయ్య ఉగ్రరూపం చూడాల్సి వస్తుందట. బాబాయ్, అబ్బాయ్ ల మధ్య దూరం దగ్గరవ్వాలని నందమూరి అభిమానుల కోరిక.


అయితే దగ్గరవడం కాదు ఇంకా దూరం పెరిగే పరిస్తితులు కనిపిస్తున్నాయి. టిడిపిలో హరికృష్ణకు ఎలాంటి కేడర్ ఇవ్వని చంద్రబాబు పార్టీకి దూరం చేశాడు. ఇప్పుడు అదే ఆ కుటుంబానికి వీరు దూరమయ్యేలా చేసింది. కళ్యాణ్ రామ్ ఒక్కడే బాలకృష్ణ సినిమా వేడుకలకు, ఈవెంట్లకు వెళ్తుంటాడు. 


ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి హరికృష్ణ వై.ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తండ్రి చేరితో తనయులిద్దరు చేరినట్టే. ఆ లెక్కన టిడిపికి గుడ్ బై చెప్పి తారక్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినట్టే. సో ఇది నందమూరి ఫ్యాన్స్ కు నచ్చని అభిప్రాయమే.. దానిపై వారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. 


నందమూరి ఫ్యాన్స్ కొందరు ఎన్.టి.ఆర్ చేసే ఎలాంటి పనికైనా సపోర్ట్ ఇచ్చేలా ఉన్నారు. కాని కొందరు మాత్రం కేవలం పార్టీ తరపున ఎప్పటికైనా నందమూరి కుటుంబం కలవదా అన్న ఆలోచనలో ఉన్నారు. ఈలోగా వై.సి.పిలోకి ఎన్.టి.ఆర్ వెళ్తే మాత్రం సంచలనమే అవుతుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియదు కాని తారక్ తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: