సినీ ఇండస్ట్రీ లో ఇప్పుడు  ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పాలి. ఏదైనా రిలీజ్ చేసే ముందు దాని రెస్పాన్స్ తెలుసుకోవడానికి కావాలని ఒకటి లీక్ చేస్తారు. అయితే అంత వరకు బాగానే ఉంది కానీ లీక్ చేసి తీరా అది మాది కాదు ఫేక్ అని అనేస్తున్నారు. ఇక్కడే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. లీక్ చేయడం ఎందుకు అది ఫేక్ అని చెప్పడం ఎందుకు అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 

Image result for nagarjuna

శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ ఇదేనంటూ నిన్నంతా సోషల్ మీడియాలో ఓ స్టిల్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అది ఫేక్ ఫస్ట్ లుక్ అని తమకు సంబంధం లేదని ఆ తర్వాత మేకర్స్ ప్రకటించారు. కానీ అది శైలజారెడ్డి అల్లుడు సినిమాలోని స్టిల్లే. ఆ విషయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో రుజువులతో పాటు చూపించారు. నిజానికి ఫస్ట్ లుక్ గా ఇదే స్టిల్ విడుదల చేయాలని యూనిట్ భావించింది.

Image result for nagarjuna

కానీ క్లాస్ లుక్ తో రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియక డైలమాలో పడిన సందర్భంలో, నాగ్ సూచన మేరకు ఇలా కావాలనే ఆ స్టిల్ ను లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఆ స్టిల్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో, ఈ వారంలో చైతన్య మాస్ లుక్ తో అఫీషియల్ గా మరో ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది. మరోవైపు సవ్యసాచి సినిమాతో పోటీ కూడా ఇలా స్టిల్ లీకవ్వడానికి ఓ రీజన్ అని తెలుస్తోంది. లెక్కప్రకారం శైలజారెడ్డి అల్లుడు సినిమా కంటే ముందు సవ్యసాచి విడుదలవ్వాలి. కానీ శైలజారెడ్డి అల్లుడు సినిమాను ముందుగా థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనతో ఈ లీకేజీ బాణాన్ని వదిలినట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: