మహేష్ సినిమాల ప్రమోషన్ విషయంలో అతడి భార్య నమ్రత కీలక పాత్ర పోషిస్తుంది. ఈవిషయం కోసం ఆమె ముంబాయ్ నుండి ఒక ప్రత్యేకమైన టీమ్ ను రప్పించి మహేష్ సినిమాల ప్రమోషన్ బాధ్యతను చాల వ్యూహాత్మకంగా నమ్రత నిర్వర్తిస్తోంది. 
mahesh babu, mahesh babu films, mahesh babu vamsi paidipally, vamsi paidipally twitter, mahesh babu vamsi film, mahesh babu film news, tollywood news, entertainment news
ఇలాంటి పరిస్థుతులలో మహేష్ తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక విషయంలో నమ్రత తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోవడంతో #MB25 అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రమోట్ చేస్తున్నారు. 
চিত্র:নম্রতা শিরোদকর.jpg
అయితే ఇలా ప్రమోట్ చేయడం నమ్రతకు ఏమాత్రం నచ్చడం లేదు అని టాక్. మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ కి చేరిపోవడంతో ఈ సూపర్ స్టార్ ఇమేజ్ అర్ధం గుర్తుకు వచ్చేలా #SSMB25 అని ప్రమోట్ చేయాలి కానీ సాధారణ హీరోల సినిమాలలా #MB25 అని ప్రమోట్ చేయడం ఏమిటి అని నమ్రత మహేష్ పిఆర్ టీమ్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచినట్లు టాక్. 
Mahesh Babu
దీనితో రానున్న రోజులలో ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించిన హ్యాస్ ట్యాగ్స్ విషయంలో #SSMB25 అని మహేష్ టీమ్ ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. దీనికితోడు ఈమధ్య విడుదల అయిన టాప్ హీరోల 25వ సినిమాలు చాల వరకు ఫ్లాప్ అయిన సెంటిమెంట్ కూడ నమ్రతను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఘోరమైన ఫ్లాప్ గా మారడం అదేవిధంగా జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ కలక్షన్స్ విషయంలో పెద్దగా సంచలనాలు సాధించకపోవడంతో టాప్ హీరోలకు 25వ సినిమా కలిసి రాదా ? అన్న సెంటిమెంట్స్ హడావిడి చేస్తున్న నేపధ్యంలో మహేష్ 25వ సినిమా విషయమై ప్రతి చిన్న విషయంలోనూ నమ్రత అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..     


మరింత సమాచారం తెలుసుకోండి: