టాలీవుడ్ లో అందరీ పెద్ద కుటుంబాల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తనయుడు ఇంతవరకు ఎంట్రీ ఇవ్వలేదు. దాని గురించి ఇప్పడూ అస్సలు ఊసే లేదు. అయితే ఇంతక ముందు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పడు అవేమి వినిపించడం లేదు.బాలయ్య సన్నిహితుడు సాయి కొర్రపాటి తానే మోక్షజ్ఞ సినిమాను నిర్మిస్తానని చాలాసార్లు చెప్పారు. ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు అప్పట్లో వినిపించింది. మరి ఆ తరువాత ఇక ఆ ప్రస్తావన లేదు.

Image result for mokshagna

ఈ మధ్య బాలయ్య చేసే సినిమాల మీదే తప్ప, మోక్షజ్ఞ గురించి ఒక్కవార్త కూడా లేదు. ఎన్టీఆర్ బయోపిక్, బోయపాటి సినిమా, వినాయక్ సినిమా అంటూ ఆ వార్తలే తప్ప, మోక్షజ్ఞ ఎంట్రీ మీద ఒక్క వార్తా లేదు. మరోపక్క బయోపిక్ లో ఎవరి ఎవరి పేర్లో వినిపిస్తున్నాయి కానీ, మోక్షజ్ఞ పేరు వినిపించడం లేదు. ఇదిలా వుంటే ఇటీవల మోక్షజ్ఞ తరచు ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ లో మిత్రులతో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. 


Image result for mokshagnaకానీ మోక్షజ్ఞ వయసు మించిన భారీ శరీరంతో కనిపిస్తున్నాడని అంటున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అంటే మాత్రం మోక్షజ్ఞ చాలా వర్కవుట్ చేసి, శరీరాకృతి బాగా తగ్గించుకోవాలని టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ ఓ మూడునెలల్లో బాగా పెర్ ఫెక్ట్ ఫిజిక్ తో రాగలిగితే కనుక, ఎన్టీఆర్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లతో బయోపిక్ లో తెరంగ్రేటం చేయించేద్దామని క్రిష్ సలహా కూడా ఇచ్చినట్లు వినిపిస్తోంది. అయితే అధిక బరువు కారణంగానే మోక్షజ్ఞ  ఎంట్రీ లేట్ అవుతుందని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: