ఆ మద్య పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాన్ కొట్టే పంచ్ డైలాగ్స్ గుర్తుందికాదా..! సింహం పడుకుంది కదా అని జడవేయొద్దు..పులి పలకరించింది కదా అని ఫోటో దిగొద్దురోయ్...అంటాడు.  తాజాగా ఇప్పుడు హీరో నవదీప్ కి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  బిగ్ బాస్ సీజన్ 1 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో అదరగొట్టిన నవదీప్ చివరిదాకా ఉన్నాడు. 
Image result for navadeep big boss
ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్న నవదీప్ తాజాగా ఓ ఫారెస్ట్ లో ఫోటో దిగాడు.  అదేంటీ ఫోటో దిగితేనే అంత సెన్సేషనా అంటారా..! ఆ ఫోటోలో చాలా ప్రత్యేకత ఉంది.  నవదీప్ పెద్దపులితో సెల్ఫీ దిగి ఆ ఫోటోను పోస్టు చేశాడు.
Image result for navadeep big boss
‘‘ఏరా పులీ'' అంటూ సూపర్ హిట్ చిత్రం "యమదొంగ"లోని డైలాగ్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ఇప్పుడు మరో ఫొటోను పోస్టు చేసి సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఓ అడవిలోకి వెళ్లిన నవదీప్.. అక్కడ పెద్ద పెద్దపులితో సెల్ఫీ దిగాడు. అయితే ఈ ఫోటో ఎక్కడ తీశాడనేది తెలియలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: