ప్రస్థుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తూ ఉన్నా వాటిని డీల్ చేయడం చాల కష్టసాధ్యం అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్దికాలం గ్యాప్ తో ‘మహానటి’ అదేవిధంగా ‘సంజు’ సినిమాలు బయోపిక్ లుగా విడుదలై సంచలన విజయాలు సృస్టించిన నేపధ్యంలో ఇప్పుడు అందరిదృష్టి బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ఉంది. 

వాస్తవానికి ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్ననేపధ్యంలో ఈ బయోపిక్ ను సరైన విధంగా తీస్తే తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించే ఆస్కారం ఉంది. 
అయితే ఎన్టీఆర్ బయో పిక్ ను స్వయంగా బాలకృష్ణ నిర్మిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో అసలైన నిజాలు బయటకు వచ్చే ఆస్కారం లేదు. ఈసినిమా దర్శకత్వానికి సంబంధించి అనేక మలుపులు తీసుకుని చివరకు క్రిష్ దర్శకత్వంలో ఈమూవీ షూటింగ్ అతిత్వరలో ప్రారంభం అవుతున్న నేపధ్యంలో సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ ను అయోమయంలో పడేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంజయ్ దత్ లోని నెగిటివ్ కోణాలను ఇంచుమించు వాస్తవికంగా చూపించడంతో ‘సంజు’ బయోపిక్ ఆ రేంజ్ లో సూపర్ హిట్ అయింది. నందమూరి తారకరామారావు జీవితంలోని చీకటి కోణాలను ఏమాత్రం చూపించకుండా కేవలం 60 కోట్లు ఖర్చుపెట్టి ఎన్టీఆర్ బయోపిక్ ను తీసినా జనం చూస్తారా ? అన్న సందేహం రోజురోజుకు క్రిష్ కు పెరిగిపోతున్నట్లు సమాచారం.‘మహానటి’ ‘సంజు’ ల బయోపిక్ ల తరువాత రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నిజయితీగా వాస్తవాలు కనిపించకపోతే జనం తిరస్కరణలో ఎన్టీఆర్ బయోపిక్ కు తీవ్రఅవమానం జరుగుతుంది అన్నభయాలు క్రిష్ కు ఉన్నా బాలయ్య ముందు చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. 


గతంలో ‘పోతన’ ‘వేమన’ ‘ఆంధ్రకేసరి’ లాంటి చాల బయోపిక్ ప్రయోగాలు ఫెయిల్ అయిన నేపధ్యం ఉంది. ఇలాంటి పరిస్థుతులలో వాస్తవాలు లేకుండా కేవలం డాక్యుమెంటరీలా రూపొందబోతున్న ఎన్టీఆర్ బయో పిక్ ఇన్ని వ్యతిరేక పరిస్తుతులను తట్టుకుని అసలు నిలబడగలుగుతుందా అన్న అనుమానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అంతేకాదు రానున్న ఎన్నికల సంవత్సరంలో రిలీజ్ కాబోతున్న ఈ బయోపిక్ ను చూసి ప్రభావితం అయి జనం తెలుగుదేశానికి ఓట్లు వేస్తారా అన్న సందేహాలు కూడ వినిపిస్తున్నాయి. ఏమైనా అనేకసందేహాల మధ్య రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం కావడం నందమూరి అభిమానుల ఆకాంక్ష.. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: