ఈ మద్య బాలీవుడ్ లో   ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’సినిమా తెరకెక్కించారు.  తెలుగు లో ‘మహానటి’ ఏ రేంజ్ లో సెన్సేష్ క్రియేట్ చేసిందో అందిరికీ తెలసిందే.  ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు లో మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమయ్యరు. 

 వాస్తవానికి ఈ చిత్రానికి మొదట తేజ దర్శకత్వం వహిస్తున్నారని అన్నారు..కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు.  దాంతో కొన్ని రోజుల వరకు ఈ ప్రాజెక్ట్ పే ఎన్నో అనుమానాలు కలిగాయి.  కానీ గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని అందించిన క్రిష్ ఇప్పుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని తీసేందుకు ముందుకు వచ్చారు. అయితే క్రిష్ చేరిక ముందు వరకూ ఓ విధంగా… క్రిష్ చేరిక తరవాత మరో విధంగా… నందమూరి తారక రామారావు బయోపిక్ ‘యన్.టి.ఆర్’ పనులు జరుగుతున్నాయి.

నటీనటుల విషయంలో ఎంతో జాగ్రత వహిస్తున్నాడు క్రిష్.  ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్ పాత్రకు హిందీ సినిమాల్లో నటించే బెంగాలీ నటుడు జిష్షు యు సేన్‌గుప్తాను ఎంపిక చేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా ‘మణికర్ణిక’లో ఇతను ఝాన్సీ లక్ష్మీభాయి భర్తగా నటించాడు.

ఆ సినిమా విడుదలకు ముందే అతడికి మరో అవకాశం ఇచ్చారు క్రిష్. సౌత్ ఇండస్ట్రీలో అతడికి ఇదే తొలి సినిమా. ఇందులో బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబుగా రానా దగ్గుబాటి, నాదెండ్ల భాస్కరరావు పాత్రలో సచిన్ ఖడేకర్ నటించనున్నట్టు జిష్షు సేన్‌గుప్తా కన్ఫర్మ్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: