తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 పదహారు మంది సభ్యులు పాల్గొన్న విషయం తెలిసిందే.  అయితే అందులో పదమూడు మంది సెలబ్రెటీలు కాగా, ముగ్గురు మాత్రం కామన్ మాన్స్ గా వెళ్లారు.  అయితే బిగ్ బాస్ మొదటి రోజే కామన్ మాన్  ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన్ నాయుడికి జైలుకి జైలు శిక్ష వేశారు.  మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్ లో సంజన  వెళ్లారు. 

పోల్చి చూడలేం

తర్వాత రెండో ఎలిమినేషన్ లో నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు.  దాంతో కామన్ మాన్ గా వెళ్లినవారినే టార్గెట్ చేస్తున్నారని కామెంట్స్ వినిపించాయి.  ఎలిమినేషన్ జరిగేకొద్దీ ఆడియన్స్ లో షో పై ఆసక్తి పెరుగుతోంది.  మొన్నటి ఆదివారం గణేష్, గీతామాధురి, కిరీటి నామినేషన్ రౌండ్ లోకి వచ్చారు.  వీరిలో కిరీటి నామినేష్ అయ్యారు. 

నాని వల్లే జీవితాలు తారుమారు

షో నుంచి ఎలిమినేట్ అయిన కిరీటి ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తనకు షో నుంచి ఎలిమినేట్ కావడం భాద కలిగించలేదని, ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటానని చెబుతున్నాడు.   బిగ్ బాస్ షో విజయవంతంగా నడపడానికి 400 మంది పనిచేస్తున్నారని కిరీటి తెలిపారు. ఇక కుట్రలు చేసే సమయం ఎక్కడ ఉంది.

బాబు గోగినేని గురించి

ఇది రియాలిటీ గేమ్ షో మాత్రమే అని, ఎవరికీ తగ్గట్లు వారు ఆడుతారని కిరీటి తెలిపారు. బాబు గోగినేని తనకు మంచి స్నేహితుడిగా మారిపోయారని కిరీటి తెలిపాడు. స్వేచ్ఛగా ఆలోచించగలగడం అందరి బాధ్యత అని ఆయన చెప్పిన మాటని జీవితాంతం గుర్తుంచుకుంటానని కిరీటి తెలిపారు.బిగ్ బాస్ లో నాని వల్లే జీవితాలు తారుమారు అవుతాయని కిరీటి తెలిపాడు. నాని చెప్పే ఒక్క మాటపైనే కంటెస్టెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: