సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ తెలుగు లో శివ సినిమా తర్వాత కామెడీ, హర్రర్, థ్రిల్లర్, మాఫియా తరహా సినిమాలు తీశారు.  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మ ఎన్నో మాఫియా సినిమాలు తీశారు.  వాటిలో 1998 లో విడుదల అయినా సత్య సినిమా ఒక సెన్సేషన్ సృష్టించింది. కల్ట్ సినిమాలలో అగ్రస్థానం కచ్చితంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సత్య సినిమాకే ఇవ్వాలి. పెట్టిన బడ్జెట్ కి 7  రేట్లు ఎక్కువ సంపాదించి పెట్టిన సినిమా అది. 


ఆ సినిమా విడుదల   20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. సత్య చిత్రం ప్లానింగ్ ప్రకారం తీసిన మూవీ కాదని వర్మ తెలిపాడు. ఈ సినిమా విషయంలో అన్నీ అనుకోకుండా జరిగిపోయాయని తెలిపాడు. తన స్నేహితులు తెలిపిన కొన్ని సంగతుల ఆధారంగా ఈ చిత్ర కథ సిద్ధం చేసానని అన్నారు. సత్య చిత్రం చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని అప్పుడు అనుకోలేదు.     


తాను రంగీలా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్లిన తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని చెప్పటం మొదలు పెట్టిన వర్మ తనకు ఎప్పుడు అండర్ వరల్డ్ గొడవల్లో ఎవరు చనిపోయినా - వారి కంటే వారిని చంపిన వారి గురించే ఎక్కువ ఆలోచనలు వస్తాయి అని ఎప్పుడు గ్యాంగ్ స్టర్స్ గురించి విన్న వారు ఎప్పుడు చంపారు - ఎలా చంపారు కన్నా చంపే ముందు ఎం చేసుంటారు అన్న సందేహం నుండి పుట్టిన కథే సత్య అని చెప్పుకొచ్చారు. 

Image result for ram gopal satya movie

అలానే మనోజ్ బాజ్ పాయి - షూరభ్ శుక్ల మరికొన్ని పాత్రలు కూడా తాను చూసిన లేక తాను విన్న వారిని మనుసులో పెట్టుకుని రాసుకున్నవే అని తెలియజేసాడు. ఈ సినిమా అనుకోగానే తనకు బాగా పరిచయమున్న అనురాగ్ కశ్యప్ ను కలిశానని - తరువాత తన డైలాగ్స్ వల్లనే సినిమా బాగా క్లిక్ అయింది అని కితాబిచ్చాడు ఆర్జీవీ.


 సందీప్ చౌతా బాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యిందని అన్నారు. సత్య క్యారెక్టర్ ఒక్కటే అని - అలాగే ఎలా చేయాలి అని చెప్పకుండా యాక్టర్లనే వారికి తోచినట్టు చేయమన్నానని స్పష్టం చేసాడు వర్మ. టీం మొత్తానికి కృతజ్ఞతలు చెప్తూ పోస్ట్ ను ముగించాడు రామ్ గోపాల్ వర్మ. 


మరింత సమాచారం తెలుసుకోండి: