తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన  ‘బుజ్జిగాడు’చిత్రంలో త్రిష చెల్లెలుగా నటించిన సంజన ఎంతో చలాకీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.  తెలుగు , తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఆ మద్య దండుపాళ్యం చిత్రంలో న్యూడ్ గా నటించిందని పెద్ద రూమర్లు పుట్టాయి.  కానీ అది కేవలం గ్రాఫిక్ అని కొట్టిపడేసింది ఈ అమ్మడు. 
Image result for actress sanjana
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిని సంజన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను కూడా ఎన్నోసార్లు మానసికంగా ఇబ్బందులు పడ్డానని తెలిపింది.  తన 17 యేళ్ల వయసులో నేను ఒక సినిమా చేశాను. ఆ సినిమా దర్శకుడు .. సీన్ లో ఒక భాగంగా నాతో హీరోకి ముద్దు పెట్టించాడు. నేను చేయనని చెబితే .. చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు.  ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ముద్దు సీన్ చూస్తుంటే మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు. 
Image result for actress sanjana
ఇక కాలేజ్ లో అయితే కామెంట్స్ మామూలుగా లేవు. ఆ సమయంలో మా అమ్మ నేను మానసికంగా ఇబ్బంది పడి  ఆత్మహత్య చేసుకుంటానని భయపడిపోయింది. ఆ దర్శకుడు ఒక కొండపై వున్న సన్నని బండపై నన్ను నడిపించాడు. ఏ మాత్రం కాలు జారినా నదిలో పడిపోతాను. అయినా నా రక్షణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అందరిలోను నాపై అరిచేస్తూ చేయించాడు. అలాంటి సైకో డైరెక్టర్ ను నేను మళ్లీ చూడలేదు" అంటూ చెప్పుకొచ్చింది


మరింత సమాచారం తెలుసుకోండి: