బాలీవుడ్ హాట్ బ్యూటీ  కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.  సాధారణంగా హీరోయిన్లు బికినీ పిక్స్‌ను సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్టు చేస్తే వారి అభిమానులు ఆనందిస్తూ ఉంటారు. తమ కామెంట్లతో వారిని అభినందిస్తూ ఉంటారు. తమ ప్రేమను చాటుకొంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి హాట్ ఫొటోలు రూటు మారుతూ ఉంటాయి.

అడ్డం తిరుగుతూ ఉంటాయి.  తాజాగా ఈ అమ్మడు కాస్మోపొలిటన్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై.. బాలీవుడ్ స్టార్ బికినీలో మెరవనున్నది. జూలై ఎడిషన్‌లో కంగనా తన అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేయనున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా అఫిషియల్ టీమ్ ఆ ఫోటోను పోస్ట్ చేశారు.  గతంలో ఎన్నో సార్లు బికినీతో దర్శనమిచ్చినా కంగనా ఈసారి మాత్రం వెరైటీ బికినీతో అదరగొట్టింది.   ఫిట్‌నెస్ లక్ష్యాల గురించి కంగనా ఆ మ్యాగ్జిన్‌లో కొన్ని టిప్స్ ఇవ్వనున్నది.
kangana ranaut poses in a bikini
ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కంగనా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మణికర్నిక చిత్రంలో రాణీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగన కనిపించనున్నది. రాజ్‌కుమార్ రావుతో మెంటల్ హైక్యాలోనూ నటిస్తున్నది. ఈ రెండు సినిమాలు త్వరలో రిలీజ్‌కానున్నాయి. అయితే ఆ బికినీ డిజైన్ కొంత ఎబ్బెట్టుగా ఉంది. ఈ బికినీలో హాట్‌గా కనిపించడం మాటేమిటో కానీ.. కంగనాను చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: