తెలుగు సినిమా రంగంలో మూవీ భారీ బడ్జెట్, సెట్ లు వేసే దర్శకుడు గుణశేఖర్. తాజాగా ఇటీవల రుద్రమ్మదేవి అంటూ సోషియో ఫాంటసీ సినిమా తీసిన సంగతి అందరికి తెలిసినదే. ఇదిలావుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో 180 కోట్ల భారీ బడ్జెట్ తో దగ్గుబాటి రానా తో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు డైరెక్టర్ గుణశేఖర్. హిరణ్యకశ్యప అనే కథను ఆధారంగా  రాసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి  ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Related image

రానా హోమ్ బ్యానర్ లోనే సురేష్ బాబు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related image

మరోపక్క ఈ సినిమాలో తన పాత్ర కోసం ఇప్పటి నుండే రానా జిమ్ కి వెళ్తున్నట్టు సమాచారం. మరి ముఖ్యంగా ఈ సినిమాలో గుణశేఖర్ విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట..

Image result for rana gunasekhar

ఇందుమూలంగా దేశంలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ అయిన ముకేశ్ సీంగ్ తో ఇప్పటికే కొన్ని డ్రాయింగ్స్ వేయిస్తున్నారట. వైకుంఠం – ఇంద్రలోకం మరియు హిరణ్యకశ్యప పాత్ర కు సంబందించిన డ్రాయింగ్స్ వేయిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అన్ని అధికారిక ప్రకటనలు పని చేసే విభాగాల గురించి డైరెక్టర్ గుణశేఖర్ తెలియజేస్తారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: