బాలీవుడ్ లో హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ ఎన్నో సంచలనాలకు కేంద్రంగా ఉంటుంది.  గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మల్లికా శెరావత్ తాజాగా కాస్టింగ్ కౌచ్ సై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.  హీరోలతో తెరవెనుక చనువుగా ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని, తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లో తాను పోషించిన పాత్రల ఆధారంగా తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారని, బయట కూడా అలాగే ఉండాలని ఒత్తిడి చేశారని చెప్పింది.
Image result for మల్లికా షరావత్
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో తనకు ‘బోల్డ్ నటి’, ‘గ్లామరస్‌ నటి’, ముద్దు సీన్లలో నటిస్తుందనే పేరు రావడానికి దర్శకులు, సహ నటీనటులే కారణం అని మల్లిక చెప్పింది. ‘మల్లిక అన్నింటికీ రాజీపడుతుంది.. అందుకే ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా ఒప్పుకుంటుంది’ అనుకునేవారని తెలిపింది.  మర్డర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన  ఈ భామ మొదటి సినిమాలోనే చాలా హాట్ గా నటించి అందరి మనసు దోచింది.   

ఆ సినిమా తర్వాత మల్లికా శెరావత్ దాదాపు అన్న అలాంటి పాత్రలే వచ్చాయి..ఈ భామ కూడా మంచి క్రేజ్ వస్తుందని బోల్డ్ పాత్రలకే పరిమితం అయ్యింది. కొన్ని సార్లు తనను రాత్రి మూడు గంటల ప్రాంతంలో ఫోన్ చేసి వస్తావా అని అడిగేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  మర్డర్ సినిమా తర్వాత తనపై ఎన్నో కామెంట్స్ వచ్చాయని.. పొట్టి దుస్తులు వేసుకున్నా.. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించినా.. సిగ్గు వదిలేసిన మహిళ అని అనేస్తుంటారు. అప్పుడు మగవారు మనల్ని అలుసుగా తీసుకుంటారు. ఇండస్ట్రీలో మనోధైర్యంతో ముందుకు సాగిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని..ఏమాత్రం అలుసు ఇచ్చినా..దారుణంగా ప్రవర్తిస్తారని అంటుంది మల్లికాశరావత్.


మరింత సమాచారం తెలుసుకోండి: