ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై రెచ్చిపోయారు మెగాబ్రదర్ నాగబాబు. ఇటీవల హిందూ మతానికి సంబంధించిన దేవతలు దేవుళ్లపై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్ చేయడంతో తీవ్రంగా ప్రతిస్పందించారు నాగబాబు. దేశంలో చాలా మతాలు విశ్వాసాలు ఉన్నాయని అందరూ సహోదర భావంతో సమాజంలో మెలుగుతున్నారని అన్నారు...

Image result for kathi mahesh nagababu

వారి వారి విశ్వాసాలను బట్టి ఇతరులను గౌరవించాలని అంతేగాని నోటికి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి ప్రజల మధ్య మనస్పర్ధలు కలిగించకూడదని అన్నారు... క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని అన్నారు.

Related image

హిందూ మతం, దేవతలపై పథకం ప్రకారం దాడి జరుతోందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మహేశ్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌ని ఆయ‌న కోరారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు.

Image result for kathi mahesh

గతంలో కత్తి మహేష్ నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ నీ తీవ్రంగా  దూషించడం జరిగింది...ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో తీవ్ర పెను దుమారమే రేగింది అని చెప్పవచ్చు. మరి ప్రస్తుతం ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: