శ్రీదేవి కూతురు జాన్వీ కొత్త సినిమా లో  నటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే శ్రీదేవి కూతురిగా జాన్వీ మీద చాలా అంచనాలు ఉన్నాయన్న సంగతీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరు తనను శ్రీదేవితో పోల్చుతుంటే తనకు భయమేస్తుందని జాన్వీ చెప్పింది. నన్ను నన్నుగా చూడాలని అమ్మతో పోల్చవద్దని ఇప్పటికీ ఈమె చెప్పింది. నేను శ్రీదేవి కుమార్తెనే. కానీ, ఇప్పుడు నేను కొత్తగా వెండితెరపై నా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాను.

Image result for jhanvi kapoor

శ్రీదేవి కుమార్తెననే గుర్తింపు, నాపై ఒత్తిడిని చాలా పెంచేసింది.. అభిమానుల అంచనాల్ని అందుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే, సెట్స్‌లో తనను శ్రీదేవి కూతురిలా కాకుండా, ఓ కొత్త నటిగా మాత్రమే చూడామని యూనిట్‌ సభ్యులందరికీ చెప్పాను. ఆ విషయంలో నాకు సినిమా యూనిట్‌ పూర్తిగా సహకరించింది' అని చెబుతోంది జాన్వీ కపూర్‌. 'అతిలోక సుందరి', 'సూపర్‌ స్టార్‌' ఇమేజ్‌ సొంతం చేసుకోవడానికి శ్రీదేవికి చాలా సమయమే పట్టిందనీ, తన తొలి సినిమాకే ఆ గుర్తింపు కోరుకోవడంలేదనీ చెప్పింది .

Image result for jhanvi kapoor

పాస్‌ మార్కులేయించుకుంటే చాలనే భావనతో తాను వున్నానని చెబుతోన్న జాన్వీ, నటనలోనూ డాన్సుల్లోనూ.. శ్రీదేవిని ఎక్కడా అనుకరించకపోయినా, ఆ ముద్ర అయితే ఖచ్చితంగా తన మీద వుంటుందనీ, ఈ విషయంలో 'కాపీ' అనే కామెంట్స్‌ కొంత ఇబ్బందికరంగా వుంటాయనీ అంటోంది. అసలు శ్రీదేవితో పోలిక అంటేనే, జాన్వీకి భయమేసేస్తోందట. డాన్స్‌ని జాన్వీ, తన తల్లి శ్రీదేవి దగ్గరే నేర్చుకుందట. దానికితోడు, ప్రత్యేకంగా డాన్స్‌ ట్రైనర్‌ని ఏర్పాటు చేయడం బాగా కలిసొచ్చిందనీ, 'ధడక్‌' సినిమాకి సంబంధించి ప్రతి సాంగ్‌నీ ముందే రిహార్సల్‌ చేయించుకోవడం బాగా కలిసొచ్చిందని జాన్వీ చెప్పుకొచ్చింది. '

మరింత సమాచారం తెలుసుకోండి: